‘మహర్షి’ ఎఫెక్ట్: హాలిడే ట్రిప్ వాయిదా వేసుకున్న మహేష్ బాబు...

Recommended Video

Mahesh Cancels Holiday To Boost Maharshi's Collections || Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తన కెరీర్లో 25వ చిత్రం కావడం, సూపర్ హిట్ రావడంతో మహేష్ బాబు మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది అంటూ కాలర్ ఎగరవేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

రైతులతో పాటు నగర వాసులకు, యువతకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు ప్రశంసల దక్కుతున్నాయి. అయితే మహర్షి చిత్రాన్ని అలా వదిలేయకుండా మరో లెవల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనలో సూపర్ స్టార్ ఉన్నారట. ఇందుకోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

హాలిడే కేన్సిల్ చేసుకున్న మహేష్ బాబు

హాలిడే కేన్సిల్ చేసుకున్న మహేష్ బాబు

సాధారణంగా మహేష్ బాబు తన సినిమా రిలీజ్ తర్వాత హాలిడే ప్లాన్ చేసుకుంటారు. ‘మహర్షి' విడుదల తర్వాత కుటుంబంతో కలిసి విదేశీ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం హాలిడే కేన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ‘మహర్షి' సినిమాను మరింత ఎక్కువ ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.

మహేష్ బాబు కెరీర్లో తొలి 100 కోట్ల షేర్ మూవీ

మహేష్ బాబు కెరీర్లో తొలి 100 కోట్ల షేర్ మూవీ

ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాలేవీ కూడా రూ. 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేయలేదు. గత చిత్రం ‘భరత్ అనే నేను' రూ. 95 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అయితే ‘మహర్షి' మహేష్ బాబు కెరీర్లో రూ. 100 కోట్ల షేర్ వసూలు చేసే తొలి చిత్రం కాబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయడమే లక్ష్యంగా మహేష్ బాబు టూర్

నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయడమే లక్ష్యంగా మహేష్ బాబు టూర్

మహేష్ బాబు లక్ష్యం కేవలం రూ. 100 కోట్ల షేర్ రీచ్ అవ్వడం కాదు... ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడమే. ఇందుకోసం ఆయన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో థియేటర్లకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయబోతున్నారట.

రైతులు, విద్యార్థులతో ఇంటరాక్షన్

రైతులు, విద్యార్థులతో ఇంటరాక్షన్

కేవలం సినిమాను ప్రమోట్ చేయడమే కాదు రైతులు, విద్యార్థులతో మహేష్ బాబు ఇంటరాక్ట్ అయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. వ్యవసాయం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, రైతుపై సింపథీ చూపించే పరిస్థితులు పోయి... రైతు అంటే గర్వంగా చూసే పరిస్థితులురావాలనే సందేశంతో ఈ చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.

వసూళ్లు ఎలా ఉన్నాయంటే...

వసూళ్లు ఎలా ఉన్నాయంటే...

‘మహర్షి' మూవీ వసూళ్ల తీరు పరిశీలిస్తే... నైజాం ఏరియాలో నాన్ బాహుబలి రికార్డులను బద్దుల కొడుతూ తూసుకెళుతోంది. అయితే ఆంధ్రాలోని కొన్ని ఏరియాల్లో కాస్త వెనకబడే ఉంది. యూఎస్ఏలో వసూళ్లు మహేష్ బాబు స్థాయితో పోలిస్తే యావరేజ్ అనే విధంగా ఉన్నాయి.

మహర్షి

మహర్షి

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X