నిజమా? మహేష్ బాబు గురించి హాట్ న్యూస్

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ టాప్ యాక్టర్లలో మహేష్ బాబు పేరును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసి అభిమానులను అలరించారు. అయితే ఆయన ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ద్విపాత్రాభినయం చేయలేదు.

తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో మహేష్ బాబు డబల్ యాక్షన్ చేయబోతున్నారని వినికిడి. ఈ విషయం ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

Mahesh Babu To Play Double Role In Koratala Siva's Next

ఈ చిత్రం ఈ ఆగస్టు 11న పద్మాలయ స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు లేకుండానే షూటింగ్ మొదలైంది. మహేష్ బాబు లేని సీన్లను సపోర్టింగ్ యార్టర్లతో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' చిత్ర షూటింగులో భాగంగా యూరఫ్ వెళ్లారు. అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత కొరటాల శివ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్నాడు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఇంకా ఈచిత్రానికి హీరోయిన్ కూడా ఫైనల్ కావాల్సి ఉంది. ఇప్పటికే పలవురి పేర్లు వినిపిస్తున్నా ఎవరూ ఫైనల్ కాలేదు. అన్నీ ఓకే అయిన తర్వాత వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X