Mahesh Babu: ఆ హీరోతో కలిసి మహేశ్ బాబు పేకాట.. క్లబ్ హౌస్‌లో ముక్కలు కలుపుతూ.. సంచలనంగా మారిన ఫొటోలు
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన పక్కా కమర్షియల్ చిత్రాలతో సందడి చేస్తోన్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా సినిమాకూ తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. ఏమాత్రం బ్రేకులు లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలతోనూ టై అప్ అవుతూ బిజినెస్‌మ్యాన్ అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి పేకాట ఆడుతూ కనిపించాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!
గుంటూరు కారం చేస్తున్నాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఎలాగైనా వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

కమర్షియల్ యాడ్స్‌లో బిజీ
వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో నేషనల్ వైడ్‌గా పేరు ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన కమర్షియల్ యాడ్స్‌లో ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు ఎక్కువగా నటిస్తున్నాడు. తద్వారా ఫుల్లుగా సంపాదిస్తూ దూసుకుపోతోన్నాడు.

ప్రైవేట్ ఈవెంట్లు.. పార్టీలు
షూటింగ్ పరంగా ఎంతో బిజీగా గడుపుతూ ఉండే సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతూ ఉంటాడు. అలాగే, ప్రైవేట్ ఈవెంట్లు, స్పెషల్ పార్టీలు, ఓపెనింగ్స్‌తో పాటు ఫంక్షన్లకు కూడా హాజరవుతూ ఉంటాడు. ఇలా ఎప్పుడూ ఫుల్ బిజీగా గడుపుతుంటాడు. దీంతో అతడు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ హైలైట్ అవుతూనే ఉంటున్నాడు.
క్లబ్ హౌస్‌లో పేకాటాడుతూ
సూపర్ స్టార్ మహేశ్ బాబు చిల్ అవుతూ ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ బడా కంపెనీ ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్ ఓపెనింగ్ ఈవెంట్‌కు ఈ స్టార్ హీరో హాజరయ్యాడు. ఇందులో అతడు పేకాట ఆడుతూ తెగ ఎంజాయ్ చేశాడు. మహేశ్ బాబు ఆటకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి.

చిన్నోడు పెద్దోడు ఆడారుగా
తాజాగా బయటకు వచ్చిన ఫొటోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు మరో బడా హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ సరదాగా పేకాట ఆడుతుండగా ఎవరో ఫొటోలు తీశారు. అంతేకాదు, వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసి 'చిన్నోడు పెద్దోడు పేకాట ఆడుతున్నారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇలా ఈ ఫొటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఆ పిక్ మాత్రం ఊరమాస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు పేకాటకు సంబంధించిన ఫొటోల్లో ఒకటి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం అతడు ఊరమాస్ లుక్‌తో పేక ముక్కలు కలుపుతూ కనిపించడమే. ఇక, ఈ పిక్ చూసిన వాళ్లంతా మహేశ్ బాబుకు ఈ కళ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ స్టార్ హీరోల పేకాట చర్చనీయాంశంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











