Don't Miss!
- News కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
మహేష్ బాబు ‘పోకిరి’ కి నాలుగేళ్లు
ఏప్రిల్ 28, 2006న వేసవి కానుకగా వచ్చి తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాసి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'పోకిరి". ఈ చిత్రం రిలీజై ఈ రోజుకు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీమతి ఇందిర సమర్పణలో వైష్ణో అకాడమీ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్ బాబుకి 12వ చిత్రంగా. అలాగే సుమారు 12 కోట్ల బడ్జెట్ తో చిత్రం రూపొందింది. ఇలియానా ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంకోసం పూరీ జగన్నాధ్ రాసిన డైలాగులు ఇప్పటికీ ఎక్కడోచోట వినపడుతూనే ఉన్నాయి. రిలీజైన తొలిరోజు నుంచే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ చిత్రాన్ని ప్రభుదేవా తమిళంలో విజయ్ తోనూ, హిందీలో సల్మాన్ ఖాన్ తోనూ రీమేక్ చేసి విజయం సాధించారు.
ఇక 75 ఏళ్ళ తెలుగు చలన చిత్ర చరిత్రలో అత్యధిక మంది చూసిన చిత్రంగానూ, అత్యధిక రోజులు ప్రదర్శించబడిన చిత్రంగానూ (కర్నూల్ లో 4 ఆటలతో 561 రోజులు), సింగిల్ హాల్ కలెక్షన్ లలో స్టేట్ రికార్డును (హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్ లో 189 రోజులకు 1.62కోట్ల గ్రాస్ వసూళ్లతో), హైదరాబాద్ లోనే 17 థియేటర్లలలో వందరోజులు ప్రదర్శించబడిన చిత్రంగా పలు రికార్డులు సాధించింది. ఈ చిత్రం తరువాత వచ్చిన 'సైనికుడు, అతిథి" చిత్రాలు రెండూ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. దాదాపు రెండున్నరేళ్ళుగా మహేష్ బాబు నుంచి ఏ సినిమా రాలేదు. మళ్ళీ మహేష్...'పోకిరి" లాంటి మెగా హిట్ ని ఇవ్వాలని కోరుకుందాం.