»   » మహేష్ బాబు ‘రాజకీయం వేషం’ లీక్

మహేష్ బాబు ‘రాజకీయం వేషం’ లీక్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  వరుస పరాజయాలతో సతమతం అవుతున్న మహేష్‌‌బాబు ఈ సారి 'దూకుడు" తనంతో విజయాన్ని ఎగుర వేసుకు‌పోయేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీను వైట్ల చాలా కేర్ తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే సినిమాలో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో కనిపించ బోతున్నాడు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. సినిమా ట్రైలర్స్ కూడా 30 సెకన్ల లోపే ఉండటంతో సినిమా ఏ విధంగా ఉంటుందో ఊహించడం కష్టమవుతోంది.

  ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాజకీయ గెటప్‌తో ఉన్న ఫోటోలు నెట్ లోకి లీక్ అయ్యాయి. దీంతో మహేష్ బాబు ఇందులో ఎమ్మెల్యే గెటప్ లో కనిపించ బోతున్నాడని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే మహేష్ బాబు మాత్రం తాను చేసేది ఎమ్మెల్యే పాత్ర కాదని, పొలిటికల్ ఇన్ ఫార్మర్ పాత్ర మాత్రమే అని తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. ఏది ఏమైనా మహేష్ బాబు 'దూకుడు" ఏ అంశంపై ఉంటుందో? సినిమా సినిమా విడుదలైతే కానీ తెలియదు.

  కాగా ...ఆగస్టు 13న దూకుడు ఆడియో విడుదల చేయాలని నిర్ణయించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, రాము ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత నటిస్తోంది.

  English summary
  Mahesh Babu is said to be playing the role of a police informer in the film but the fact behind this MLA getup is not disclosed by the makers. Srinu Vytla is not revealing the plotline of the Dookudu and is taking utmost care to keep it as suspense to the audience. The trailers and promos of the film also are below of 30 seconds to maintain the suspense. However, the curiosity on the Dookudu is reaching peaks with each passing day.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more