»   » మహేష్ బాబు‘ఆగడు’లో ఆ సీన్లు తెగనవ్విస్తాయట!

మహేష్ బాబు‘ఆగడు’లో ఆ సీన్లు తెగనవ్విస్తాయట!

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Mahesh Babu, Posani comedy scenes to be a highlight in Aagadu
హైదరాబాద్: శ్రీను వైట్ల సినిమా అంటేనే కామెడీ సీన్లు కావాల్సినన్ని ఉంటాయి. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నపుడు హీరోకు, కమెడియన్ల మధ్య వచ్చే సీన్లలో హాస్యం బాగా పండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంతకు ముందు శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' సినిమా చూసిన వారికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

'దూకుడు' సినిమాలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ లాంటి కమెడియన్లను శ్రీను వైట్ల ఏ రేంజిలో వాడుకున్నాడో.........తాజాగా వస్తున్న 'ఆగడు' చిత్రంలోనూ అదే విధంగా కమెడియన్లు వాడుకుని థియేటర్లో నవ్వుల వర్షం కురిపించబోతున్నాడు శ్రీను వైట్ల. ఈ సారి బ్రహ్మానందంకు తోడుగా పోసాని కృష్ణ మురళి కూడా సినిమాకు జతయ్యాడు.

'ఆగడు' చిత్రంలో మహేష్ బాబు-పోసాని కృష్ణ మురళి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే విధంగా, కొత్తగా ఉంటాయని అంటున్నారు. అదే జరిగితే ప్రేక్షకులకు నవ్వుల పండగే. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాతగా ఓ సినిమా రాబోతోందనే వార్తలపై అశ్వినీదత్ స్పందించారు. ఫ్యామిలీతో కలిసి తిరుమల వచ్చిన సందర్భంగా అశ్వినీదత్ మాట్లాడుతూ ఈ సినిమా గురించిన విషయాలు వెల్లడించారు. నవంబర్లో మహేష్ బాబుతో సినిమా మొదలు పెడుతున్నట్లు తెలిపారు. మైత్రి మూవీస్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కనుంది. ఆగడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.

English summary

 Mahesh Babu, Posani comedy scenes to be a highlight in Aagadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu