లవ్ స్టొరీ సినిమాపై మహేష్ బాబు రివ్యూ.. సాయి పల్లవికి ఎముకలు ఉన్నాయా? అంటూ ఫన్నీగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ వేవ్ తర్వాత భారీ విజయాన్ని అందుకున్న లవ్ స్టోరీ సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా ఇండియా మొత్తంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా ఈ లవ్ స్టోరీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మహేష్ బాబు కూడా ఈ సినిమాపై విభిన్నంగా రివ్యూ ఇచ్చారు. ముఖ్యంగా సాయిపల్లవి పై మహేష్ బాబు చేసిన పాజిటివ్గా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

చిన్న సినిమాలపై కూడా

చిన్న సినిమాలపై కూడా

సాధారణంగా మహేష్ బాబు ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక కొత్త సినిమాలు రిలీజ్ అయితే మహేష్ బాబు తనదైన శైలిలో రివ్యూలు కూడా అందిస్తూ వస్తున్నారు. కేవలం తన సినిమాలపై మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న చిన్న సినిమాలపై కూడా మహేష్ బాబు పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.

లవ్ స్టోరీ గేమ్ చెంజర్

లవ్ స్టోరీ గేమ్ చెంజర్

ఇక లవ్ స్టోరీ పై ముందు నుంచి ఆసక్తిని చూపిస్తున్న మహేష్ బాబు ఇటీవల ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చారు. దర్శకుడు శేఖర్ కమ్ముల అన్ని విషయాలను చాలా ప్రణాళికలతో చూపించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య న్యూ ఏజ్ యాక్టర్ గా మంచి నటనను కనబరిచారు అంటూ.. అతనికి ఈ సినిమా గేమ్ చెంజర్ అని కూడా తెలియజేశారు.

సాయి పల్లవిపై స్పెషల్ కామెంట్స్

సాయి పల్లవిపై స్పెషల్ కామెంట్స్

ఇక సాయిపల్లవి గురించి మాట్లాడిన మహేష్ బాబు ఎల్లప్పుడూ ఆమె ఒక సెన్సేషనల్ అంటూ ఆమెకు ఆసలు ఎముకలు ఉన్నాయా? అని డాన్స్ పెర్ఫార్మెన్స్ పై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. అలా బిగ్ స్క్రీన్ పై ఎవరిని డాన్స్ చేయడం నేను ఇంతవరకు చూడలేదు. ఒక కల లాగా ముందుకు కదులుతోంది.. అని సాయి పల్లవి మహేష్ వివరణ ఇచ్చారు.

సినిమా బ్లాక్ బస్టర్..

సినిమా బ్లాక్ బస్టర్..

సంగీత దర్శకుడు పవన్ సిహెచ్ కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు అంటూ ఇలాంటి పాటలు అతని నుంచి మరిన్ని రావాలని కోరుకున్నారు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కంపోజ్ చేశారని ఏ ఆర్ రెహమాన్ గారు తన శిష్యుడిని చూసి మరింత గర్వపడాలి అని మహేష్ బాబు ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. ఫైనల్ గా చిత్ర నిర్మాతలకు నారాయణ దాస్ నారంగ్ కు అలాగే ఏషియన్ సునీల్ కు ఇది మంచి విజయాన్ని అందించడమే కాకుండా ఇలాంటి టెస్టింగ్ టైం లో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం చాలా ముఖ్యమని కూడా తెలియజేశారు.

Recommended Video

Mahesh Babu Is The Brand Ambassador For Big C
బిజీ బిజీగా మహేష్ బాబు..

బిజీ బిజీగా మహేష్ బాబు..

ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీత గోవిందం దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మొదలుపెట్టన్నున్నడు. ఇక వచ్చే ఏడాది RRR అనంతరం రాజమౌళి దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి తీసుకురానున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X