బాలయ్యతో జతకట్టిన మహేశ్ బాబు: రికార్డులను ర్యాంప్ ఆడించేందుకు సై.. ఫొటోతో రివీల్ చేసిన స్టార్ హీరో

గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య స్నేహ సంబంధాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు. ఒకరి సినిమాలకు ఒకరు ప్రమోషన్ చేయడం.. ఒకరి షోలకు మరొకరు రావడం వంటి వాటితో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో హీరోలందరూ సరికొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ Unstoppable with NBK అనే షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులోకి ఎంతో మంది సినీ ప్రముఖులు గెస్టులుగా వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ టాక్‌ షోలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు అతిథిగా విచ్చేశాడు. దీనిపై తాజాగా అతడు స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ’తో హిట్ కొట్టిన బాలకృష్ణ

‘అఖండ’తో హిట్ కొట్టిన బాలకృష్ణ

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన చిత్రమే 'అఖండ'. దీన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకేతో ఎంట్రీ

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకేతో ఎంట్రీ

ఆరు పదుల వయసులోనూ నందమూరి బాలకృష్ణ ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ టాక్ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు.

ఆ ఎపిసోడ్స్.. సూపర్ డూపర్ హిట్‌గా

ఆ ఎపిసోడ్స్.. సూపర్ డూపర్ హిట్‌గా


'Unstoppable with NBK' టాక్ షో రెండు ఎపిసోడ్లను త్వరత్వరగా పూర్తి చేసుకుంది. మొదటి దానికి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు గెస్టులుగా వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈ రెండింటికీ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టాక్‌ షోకు చాలా క్లిక్కులు దక్కడంతో ట్రెండింగ్ అయిపోయింది.

గ్యాప్ ఇచ్చి.. వాళ్లతో మూడో ఎపిసోడ్

గ్యాప్ ఇచ్చి.. వాళ్లతో మూడో ఎపిసోడ్

ఆహాలో 'Unstoppable with NBK' టాక్‌ షోను ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. దీంతో ప్రతి శుక్రవారం ఎపిసోడ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. బాలయ్యకు సర్జరీ జరగడంతో గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే చిన్న విరామం తర్వాత బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో గత శుక్రవారమే మూడో ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు.

మహేశ్ బాబుతో 4వ ఎపిసోడ్ షూట్

మహేశ్ బాబుతో 4వ ఎపిసోడ్ షూట్


'Unstoppable with NBK' టాక్‌ షోను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆహా టీమ్. ఇందులో భాగంగానే బిగ్ సెలెబ్రిటీలను తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారం స్ట్రీమింగ్ కాబోతున్న ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా శనివారమే పూర్తైంది. దీనికోసం ఇరువురి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Recommended Video

Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
బాలయ్య షోపై మహేశ్ బాబు పోస్ట్

బాలయ్య షోపై మహేశ్ బాబు పోస్ట్

'Unstoppable with NBK' టాక్‌ షోలో మహేశ్ బాబు పాల్గొన్న విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో కోసం నందమూరి బాలకృష్ణ గారితో కలిసి ఈ సాయంత్రం ఎంతో ఎంజాయ్ చేశాను' అంటూ స్టోరీగా పెట్టుకున్నాడు. దీనికి ఓ ఫొటోను కూడా జోడించాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X