»   » మళ్ళీ... మళ్ళీ.. బూమ్ బూమ్: కూతురు వీడియో షేర్ చేసిన మహేష్ బాబు

మళ్ళీ... మళ్ళీ.. బూమ్ బూమ్: కూతురు వీడియో షేర్ చేసిన మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ ఏ రేంజిలో ఉందో మరోసారి రుజువైంది. ఆయన నటిస్తున్న 'స్పైడర్' మూవీ ఎప్పుడొస్తుందా అని ఆకలితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆ సినిమాకు సంబంధించి ఏది రిలీజైనా నమిలేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా 'బూమ్ బూమ్' అనే సాంగ్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ సాంగుకు ఊహించని స్పందన వచ్చింది. కొన్ని గంటల్లోనే మిలియన్ మార్క్ రీచ్ అయింది. 24 గంటలు గడిచేలోపు రికార్డ్ వ్యూస్ ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

'బూమ్ బూమ్' పాట ఓ వైపు క్యాచీగా ఉండి వైరల్ అవుతున్న వేళ, ఆయన కుమార్తె సితారకు కూడా తెగ నచ్చేసింది. ఇక ఇంటా, బయటా సితార ఇదే పాటను రిపీట్ మోడ్ లో పెట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఈ పాట సితారకు కొత్త ఫేవరెట్ సాంగ్ అయిపోయిందని అన్నాడు. కారులో వెళుతూ 'బూమ్ బూమ్' పాటను వింటూ ఆనందిస్తున్న సితార వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తన 'చిట్టి స్పైడర్' కారులో ఈ పాటను వింటోందని ఆనందంగా చెప్పాడు. కాగా, ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ భాషల్లో వచ్చే నెల 27న వెండితెరలను తాకనున్న సంగతి తెలిసిందే.

English summary
"She keeps listening to it on repeat mode her favourite new song" Tweeted Mahesh Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu