గూఢచారి చిత్రంపై సూపర్ స్టార్ ప్రశంసలు!
ఇటీవల విడుదలైన అడవి శేష్ గూఢచారి చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్ సీన్స్, ఊహించని మలుపులు, అడవిశేష్ నటన ఈచిత్ర విజయానికి ప్రధాన కారణాలు.
ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ జేమ్స్ బాండ్ తరహా చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ నుంచి ప్రశంసలు అందాయి. మహేష్ బాబు తాజాగా చిత్ర యూనిట్ ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

గూఢచారి చిత్రం అన్ని విభాగాల్లో ఆకట్టుకుందని మహేష్ ట్వీట్ చేశాడు. పట్టున్న కథ, కథనంతో ఆకట్టుకున్నారని తెలిపాడు. అడవిశేష్ అద్భుత పెర్ఫామెన్స్ కు మహేష్ అభినందనలు తెలియజేశాడు. అడవిశేష్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. శశి కిరణ్ దర్శకుడు. అక్కడఅమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోయిన్ సుప్రియ చాలా కాలం తరువాత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications











