నాన్న మాట బంగారు మూట: మహేష్ బాబు
నాన్న మాట బంగారు మాట అయిందని, ఆయన చెప్పినట్లే దూకుడు సినిమా 2011లో రికార్డులో తిరగరాసిందని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఈ చిత్రం ఈ రోజుతో 31 వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 'దూకుడు' చిత్రం ప్రేక్షకులు, అభిమానుల ఆదరణతో రికార్డులు సృష్టించింది. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్‌ని అందించిన 2011 సంవత్సరాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాన్న చెప్పినట్టే ఈ చిత్రం రికార్డులు తిరగరాయడం ఆనందంగా వుంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా శ్రీనువైట్లదే. నా కెరీర్‌లో అత్యుత్తమ నిర్మాతలైన రామ్, గోపీ, అనిల్‌లకు నా థాంక్స్. మళ్లీ ఈ నిర్మాతలతో మరో చిత్రం ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తున్నాను అన్నారు.
శ్రీనువైట్ల మాట్లాడుతూ... కృష్ణ గారికి అభిమానిని అయిన నేను మహేష్‌తో 'దూకుడు' లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించినందుకు ఆనందంగా వుంది. మహేష్‌తో మరోసారి 'దూకుడు'ని మించిన సినిమా చేయాలని వుంది. 2011కు గుడ్‌బై చెబుతూ 2012కు స్వాగతం పలుకుతూ 'దూకుడు' వంద రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా వుంది' అన్నారు.
మహేష్, సమంత జంటగా జి. రమేష్‌బాబు సమర్పణలో 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర దూకుడు చిత్రాన్ని నిర్మించారు. తమన్ అందించిన సంగీతం సూపర్ హిట్టవ్వగా.... మహేష్ బాబు పరవ్ ఫుల్ యాక్టింగ్ తో సినిమా బంపర్ హిట్టయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











