twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధనుష్ అదరగొట్టావు.. బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న అసురన్‌పై మహేష్‌ సెన్సేషనల్ ట్వీట్

    |

    Recommended Video

    Mahesh Babu Tweet On Dhanush's Asuran Movie || ధనుష్ అదరగొట్టేసావ్..!!

    సినిమా పరిశ్రమలో ఒక హీరో సినిమా గురించి మరో హీరో ప్రశంసలు గుప్పించడం సాధారణంగా కనిపించదు. కానీ మహేష్ బాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏదైనా సినిమా మనసుకు నచ్చితే ఎలాంటి దాపరికం లేకుండా తన స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటాడు. అప్పట్లో గూఢచారి లాంటి చిత్రాలను ప్రశంసించడమే హీరో, హీరోయిన్ల కూడా మెచ్చుకొన్నారు. కాగా తమిళనాడులో సంచలనం రేపుతున్న అసురన్ సినిమా గురించి ఓ రేంజ్‌లో ప్రశంసలు గుప్పించారు. ఇంతకు ఆ సినిమా గురించి ఏమన్నారంటే..

    అసురన్ కథ ఇదే..

    అసురన్ కథ ఇదే..

    భూమి, నీళ్ల కోసం జరిగే పోరాటంలో మధ్య తరగతి భూస్వామిని చంపిన ఓ రైతు (ధనుష్) కుమారుడి చుట్టు తిరిగే కథతో అసురన్ తెరకెక్కింది. వృద్ధుడిగా, యువకుడిగా ధనుష్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ప్రకాశ్ రాజ్, మంజు వారియర్ ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచాయి.

    కోలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద

    కోలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద

    తమిళ దర్శకుడు వెట్రిమారన్, విలక్షణ నటుడు ధనుష్ కాంబినేషన్‌లో అసురన్ చిత్రం రూపొందింది. సమాజంలో వివక్ష, కులం, భూకబ్జాలు కథాంశంగా తెరకెక్కిన అసురన్‌లో విద్య ప్రాముఖ్యతను కూడా అద్బుతంగా చూపించారు. ఈ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. అజిత్ నటించిన విశ్వాసం రికార్డులను బ్రేక్ చేసింది.

    చెన్నై పట్టణంలో

    చెన్నై పట్టణంలో

    చెన్నై పట్టణంలో అసురన్ కలెక్షన్ల దూకుడుకు ఎదురేలేకుండా పోయింది. 15 రోజుల్లో రూ.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం 17వ రోజు కల్లా 6 కోట్ల రూపాయలకు చేరువైంది. చెన్నైలో మిగితా సినిమాల నుంచి గట్టిగా పోటీ లేకపోవడంతో అసురన్ సినిమా కలెక్షన్ల పరంపర కొనసాగింది.

    10 రోజుల్లోనే రూ.100 కోట్లు

    10 రోజుల్లోనే రూ.100 కోట్లు

    ఇక తమిళనాడు వ్యాప్తంగా అసురన్ చిత్రం బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్లను వసూలు చేసింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.150 కోట్లు పూర్తి చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు, విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

    మహేష్ బాబు ప్రశంసతో ట్వీట్

    కాగా అసురన్ సినిమా చూసిన సూపర్ట్‌స్టార్ మహేష్ బాబు స్పందించారు. అసురన్ సహజసిద్ధమైన, ముతక కథాంశంతో హై ఇంటెన్సిటీతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను అద్బుతంగా తీర్చి దిద్దిన ధనుష్‌కు, దర్శకుడు వెట్రిమారన్, ప్రకాశ్ రాజ్, జవీ ప్రకాశ్, వేల్ రాజాకు కంగ్రాట్స్ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    English summary
    Super Star Mahesh Babu praises on Dhanush's Asuran. He tweeted that Asuran...raw real and intense... Cinema at its best👌Congratulations dhanushkraja, VetriMaaran, prakashraaj, gvprakash, theVcreations, VelrajR, and entire team #Asuran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X