సూర్యపై మహేశ్ బాబు ప్రశంసల వర్షం.. అదే రీతిలో స్పందించిన తమిళ స్టార్ హీరో

గతంలో పోలిస్తే ఈ మధ్య హీరోల మధ్య స్నేహం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరి సినిమాల కోసం మరొకరు ప్రమోషన్ చేయడం.. మూవీలు నచ్చితే అభినందించడం వంటివి తరచూ కనిపిస్తున్నాయి. ఇది ఏ ఒక్క ఇండస్ట్రీకో పరిమితం కాలేదు. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలు దక్షిణాదిలోని మిగిలిన భాషల సినిమాలపైనా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇటీవల విడుదలైన తమిళ సినిమాను చూశాడు. అంతేకాదు, దీనిపై అందులో నటించిన హీరోపై ప్రశంసల వర్షం కురిపించాడు.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. సుధ కొంగర తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మొదటిరోజు నుంచే మంచి టాక్‌ను అందుకున్న ఈ మూవీ.. రెండు భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, ఓటీటీలో మొదటి విజయాన్ని అందుకున్న చిత్రంగానూ రికార్డులకెక్కింది. తాజాగా ఈ సినిమా గురించి మహేశ్ బాబు స్పందించాడు. 'ఆకాశమే నీ హద్దురా స్ఫూర్తిదాయకంగా నిలిచే సినిమా. దర్శకత్వం బాగుంది. సూర్య నటన అద్భుతంగా ఉంది' అంటూ ప్రశంసించాడు.

Mahesh Babu Praises on Suriya for Aakaasam Nee HaddhuRa

పక్క పరిశ్రమకు చెందిన హీరో... తన సినిమా గురించి స్పందించడపై సూర్య సంతోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. 'మా సినిమాను ప్రశంసించిన మహేశ్ బాబుకు ధన్యవాదాలు. నీ కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' కోసం వేచి చూస్తున్నా సోదరా' అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఇరు హీరోల అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

ఇదిలాఉండగా, 'ఆకాశమే నీ హద్దురా' తమిళంలో 'సూరారై పొట్రు' అనే టైటిల్‌తో విడుదలైంది. కెప్టెన్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ అపర్ణా బాలమురళీ నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X