»   »  అలా వద్దు ఇలా: గణేష భక్తులకు మహేష్ బాబు!

అలా వద్దు ఇలా: గణేష భక్తులకు మహేష్ బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఎటూ చూసినా జై బోలో గణేష్ మహరాజ్‌కీ అంటూ నినాదాలు, ఊరూరా...వాడ వాడలా....వెలసిన బొజ్జ గణపయ్య మండపాలతో పండగ వాతావరణం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ ఉత్సవాల్లో ఆనందంగా మునిగి తేలుతున్నారు.

గణేష్ ఉత్సవాలంటే చాలా ఇష్టపడే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పడంతో....పాటు గ్రీన్ గణేష నినాదం అందుకున్నారు. పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయకులను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని భక్తుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 1(నేనొక్కడినే) చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే లండన్లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో మరో షెడ్యూల్ బ్యాంకాక్‌లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్.స

ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు శ్రీను వైట్ల దర్వకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటించబోతున్నాడు. అక్టోబర్ నెలలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని కూడా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

English summary
Tollywood super star Mahesh Babu prefers eco-friendly Ganesha. Ganesh Chavithi festival is Mahesh Babu's Favorite. He was quite an active participant in festive activities during his childhood. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu