ఫ్యాన్స్ కు మహేష్ బాబు హామీ...
నా సినిమా విడుదలకు ఎక్కువ గ్యాప్ వచ్చిందని అంగీకరిస్తున్నాను. నేను అనుకున్నది ఆరు నెలల గ్యాప్. అయితే ఫ్యామిలీలో చోటు చేసుకున్న సంఘటనలు..షూటింగ్ పోస్ట్‌పోన్ కావడం..వల్ల రెండేళ్లు గ్యాప్ వచ్చింది. అలాగే ఇకపై అభిమానులను నిరుత్సాహ పరచను అని మహేష్ అన్నారు. 2011 సంవత్సరాంతానికి ఆరు సినిమాలు విడుదల కావాలనుకుంటున్నాను. అంతేకాదు ప్రతి సంవత్సరం రెండు లేదా మూడు సినిమాలు ఖచ్చితంగా చేస్తాను చెప్పుకొచ్చారు.
ఇక తాజా చిత్రం ఖలేజా గురించి చెబుతూ...సినిమా దాదాపు పూర్తయింది. రెండు పాటలే మిగి లివున్నాయి. సెప్టెంబర్ లో విడుదలవుతుంది. ఖలేజా కథ వైవిథ్యంగా ఉందని, అందరికీ నచ్చుతుందన్నారు. శ్రీను వైట్ల సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని మహేష్‌బాబు తెలిపారు. ఇప్పటికే కథపై చర్చలు జరిగాయని, స్క్రిప్ట్ చాలా బాగుందని చెప్పుకొచ్చారు.
ఖలేజా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీను వైట్ల సమంత mahesh babu trivikram srinivas srinu vytla samantha jalsa athadu


Click it and Unblock the Notifications