కొన్ని డైలాగులతో సహా థీమ్ సాంగ్ పాడిన మహేష్-పూరి జగన్నాథ్..!
ప్రిన్స్ మహేష్ బాబు తన తాజా చిత్రం 'బిజినెస్ మెన్'లో థీమ్ సాంగ్ పాడారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అథినేత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ కు ప్రిన్స్ తో పాటు పూరీ కూడా గళాన్ని కలిపాడు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస విజయాలతో జయకేతనం ఎగురువేస్తున్న యువ సంగీత దర్శకుడు తమన్, గత కొంతకాలంగా సంగీత ప్రపంచంలో వరుస విజయాలతో సంచలనాలకు కేరాఫ్ అయిన తమన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. 'దూకుడు'తో తన తిరుగులేని ఇమేజ్‌ని మళ్లీ సొంతం చేసుకున్న మహేష్ బాబుతో 'బిజినెస్‌మేన్' చిత్రంలో పాట పాడించి అందరి దృష్టినీ ఇప్పుడు తనవైపు ఆకర్షిస్తున్నారు తమన్.
ఈ థీమ్ సాంగ్ లో కొన్ని డైలాగులు కూడా ఉన్నాయట. ఆ డైలాగ్స్ ను మహేష్ సూపర్ గా పలికారని, ప్రిన్స్ తనదైన స్టయిల్ లో రాక్ చేశాడని తమన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కచ్చితంగా ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలస్తుందని తమన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దూకుడుతో దుమ్ము రేపిన ప్రిన్స్ ఈసారి తన గీతాలాపనతో ఎలాంటి క్రేజ్ సృష్టిస్తాడనే దానిపై ఫిల్మ్ నగర్ తో పాటు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న బిజినెస్ మెన్ ఆడియో విడుదల కార్యక్రమాన్ని మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications