రాజమౌళి #ఆర్ఆర్ఆర్.... తెరపైకి మహేష్ బాబు పేరు?

By Bojja Kumar

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత రాజమౌళి #ఆర్ఆర్ఆర్ పేరుతో బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి రేంజికి ఏమాత్రం తగ్గకుండా రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండియన్ సినీ చరిత్రలోనే మరో అద్భుతం అనేలా ఉంటుందట. సినిమాపై హైప్ పెంచడానికి, ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడానికి రాజమౌళి తనకు ఎన్ని ఆప్షన్లు ఉంటే అన్ని ఆప్షన్లను వాడేస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును కూడా భాగం చేయబోతున్నట్లు టాక్.

మహేష్ బాబు స్టార్ ఇమేజ్

మహేష్ బాబు స్టార్ ఇమేజ్

మహేష్ బాబు స్టార్ ఇమేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.... ఇతర సౌత్ స్టేట్స్‌తో పాటు నార్త్‌లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబును కూడా #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో భాగం చేయాలిన రాజమౌళి ప్లాన్ చేశారట.

రాజమౌళి ఆలోచన ఏమిటి?

రాజమౌళి ఆలోచన ఏమిటి?

ఈ చిత్రం మహేష్ బాబును అతిథి పాత్రలో నటింప చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్ర కాదు... ఆయన వాయిస్ ఓవర్ ఉంటుందని మరికొందరి వాదన. ఈ విషయమై చిత్ర బృందం నుండి ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ నో చెప్పే అవకాశం లేదు

మహేష్ నో చెప్పే అవకాశం లేదు

తనకు ఇష్టమైన రాజమౌళి దర్శకత్వం.... అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో మహేష్ బాబుకు మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాజమౌళి ప్రతిపాదనకు నో చెప్పే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజమౌళి ప్లాన్స్ మామూలుగా లేవు

రాజమౌళి ప్లాన్స్ మామూలుగా లేవు

రూ. 300 కోట్ల బడ్జెట్ సినిమా అంటే కేవలం తెలుగు, తమిళంలో అయితే వర్కౌట్ కాదు. ఇండియాలో ఎక్కువ మార్కెట్ హిందీ సినిమాలకే ఉంది. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను అక్కడ మార్కెటింగ్ చేసేందుకు కరణ్ జోహార్‌ను రంగంలోకి దింపబోతున్నారట.

రాజమౌళి టీమ్ మాస్టర్ ప్లానింగ్

రాజమౌళి టీమ్ మాస్టర్ ప్లానింగ్

‘ఆర్ఆర్ఆర్' మూవీకి నిర్మాత డివివి దానయ్యే అయినప్పటికీ సినిమా తెరకెక్కించడం దగ్గర నుండి నటీనటుల ఎంపిక, మార్కెటింగ్ వ్యవహారాలన్నీ రాజమౌళి అండ్ టీమ్ చూసుకుంటున్నారట. రాజమౌళి నిర్ణయం మేరకే కరణ్ జోహార్‌తో బాలీవుడ్లో ‘ఆర్ఆర్ఆర్' మూవీ విడుదల చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

 లొకేషన్లు ఫైనలైజ్ చేస్తున్నారు

లొకేషన్లు ఫైనలైజ్ చేస్తున్నారు

సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ డార్జిలింగ్‌లో ప్లాన్ చేస్తున్నారట. అక్కడ సినిమా షూటింగ్ కోసం ప్రభుత్వ అనుమతి కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. బాహుబలి సినిమాకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X