రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం‘సామ్రాట్’ టైటిల్ ఖరార్
మహేష్ బాబు, రాజమౌళి ఈ కలయికలో చిత్రం చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. 'మగదీర' తరువాత రాజమౌళి ఇమేజ్ హైట్స్ కి చేరింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి కొత్తగా చెప్పవలసింది లేదు. 'పోకిరి' చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను అప్పట్లో అందరికీ తెలియజెప్పిన స్టార్ హీరో ఆయన. హాలీవుడ్ హీరోలా వుంటాడు అనే అభిమానాన్ని ప్రేక్షకుల్లో పొందిన మహేష్ బాబు సినిమా గురించి హీరోల అభిమానులు ఎదురు చూస్తారు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రాజస్థాన్ షూటింగ్ లో మహేష్ బిజీగా వున్నారు. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటింపజేయాలని ఒక అగ్ర నిర్మాత ప్రయత్నాలు జరుపిన కలలు నిజయమయ్యాయి. 2010 సంవత్సరంలో సినిమా షూటింగ్ కి సన్నాహాలు షురూ చేసేశారు. సో ఈ సినిమా సక్సెస్ కు మారు పేరైన ఆ నిర్మాత బేనరులో సినిమాలు చేయడానికి అందరు స్టార్స్ కూడా ఇష్టపడతారు. రాజమౌళి, మహేష్ బాబు ల కలయికలో చిత్రం నిర్మాణం జరిగితే తెలుగులో అత్యధిక వ్యయంతో తెరకెక్కే చిత్రం ఇదే అవుతుంది కాబట్టి ఈ సినిమా టైటిల్ కూడా అదే స్థాయిలో 'సామ్రాట్" అని ద్రువీకరించారు. రాజమౌళి కూడా సునీల్ హీరోగా సలోని హీరోయిన్ గా నటిస్తున్న 'మర్యాద రామన్న" చిత్రం షూటింగ్ తో బిజీగా వుండటం తెలిసిందే. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లింగా పుల్ ఎంటర్టైన్ మెంట్ తో రేపు సెట్ మీదకు రానుంది.


Click it and Unblock the Notifications











