మహేష్ బాబు, రామ్ చరణ్... మళ్లీ కలిశారు, బలపడుతున్న బంధం, ఈ ఫోటోలే సాక్ష్యం!
Recommended Video

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతోంది. గతంలో పలు సందర్భాల్లో ఫ్యామిలీస్‌తో కలిసి గ్యాదర్ అయిన ఈ స్టార్స్ తాజాగా క్రిస్మస్ వేడుకలను కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్, ఉపాసనతో పాటు మరికొందరు స్నేహితులతో కలిసి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ట్విట్టర్ ద్వారా బుధవారం అభిమానులతో పంచుకున్నారు.

రామ్ చరణ్, మహేష్ బాబు
క్రిస్మస్ వేడుకల సందర్భంగా రామ్ చరణ్, మహేష్ బాబు తమ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సెల్ఫీ ఫోజులు. హైదరాబాద్‌లోనే ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.

ఉపాసన, నమ్రత
ఉపాసన, న్రమత ఎవరికి వారే.... తమ తమ ప్రొఫెషన్లో సత్తా చాటుతున్నారు. ఉపాసన అపోలో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండగా, మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపారాలు నమ్రత చూసుకుంటున్నారు.

సితారతో ఉపాసన
మహేష్ బాబు కూతురు ఉపాసనతో కలిసి ఉపాసన. సితార ఎక్కడికి వెళ్లినా సందడే సందడి. ఎవరితోనైనా ఇట్టే కలిసిపయే తత్వం... మహేష్ బాబులోని చాలా క్వాలిటీస్ సితారలో ఉన్నాయని సన్నిహితులు చెబుతుంటారు.

మూవీస్ సైడ్
సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' సినిమా చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలవుతుండగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











