»   » మహేష్,రామ్ చరణ్ వినాయక చవితి ముచ్చట్లు(ఫోటో ఫీచర్)

మహేష్,రామ్ చరణ్ వినాయక చవితి ముచ్చట్లు(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : లంబోదరుడి వేడుకలకు అంతటా సిద్ధమైంది. అన్ని వాడలూ, వీధులూ.. పచ్చని తోరణాలు, రంగుల కాగితాలతో వర్ణశోభితంగా దర్శనమిస్తున్నాయి. చిట్టి విగ్రహాలు అందాలు చిందిస్తున్నాయి. మహాకాయుని.. మహా విగ్రహాలు... వీధివీధినా పూజలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చవితి పూజా సామగ్రి విక్రయాలు జోరందుకున్నాయి. మరోవైపు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సంబరాలు సజావుగా సాగేందుకై భారీ ఎత్తున పోలీసులు భద్రతా విధుల్లో పాలుపంచుకోనున్నారు.

  ఈ నేపధ్యంలో మన సినిమా వాళ్ళేం చేస్తున్నారు. వినాయకుడు సినిమాలకు కొత్తేం కాదు. దండాలయ్యా....ఉండ్రాలయ్యా అంటూ తెరపై తరచుగా మన తారలు కొలుస్తుంటారు... జై జై గణేశా.. జై కొడతా గణేశా... జయములివ్వు బొజ్జ గణేశా... అంటూ వేడుతుంటారు... గణపతి బప్పా మోరియా అంటూ తమ ఆనందాల్ని ఆ బొజ్జ గణపయ్యతో పంచుకుంటుంటారు... ఇప్పుడు వినాయకచవితి వచ్చింది.

  ఈ రోజు మాత్రం మన తారలకు స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వక్రతుండిడి దగ్గర భక్తి శ్రద్ధలతో మోకరిల్లేందుకు సిద్ధమయ్యారు. చిన్నతనంలో వాళ్లు చేసిన పండగ సందడిని ఇలా గుర్తు చేసుకున్నారు... ఓ తెలుగు దిన పత్రిక ఈ విషయమై రాసిన కథనంలోని కొన్ని అంశాలు..


  హీరో, హీరోయిన్స్ ...వినాయక చవితి ముచ్చట్లు స్లైడ్ షో లో

  ఇష్టమైన పండగ - రామ్‌చరణ్‌

  ఇష్టమైన పండగ - రామ్‌చరణ్‌

  ''నాకు ప్రత్యేకమైన పండగ వినాయక చవితి. ఏటా సందడిగా జరుపుకొంటాం. ఏ పండగైనా ఒకట్రెండు రోజులే. వినాయక చవితి మాత్రం వారంపాటు రోజూ చేసుకొన్నట్టుగా ఉంటుంది. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి వెళ్లి గణపతి విగ్రహాన్ని కొనుక్కొచ్చేవాణ్ని. ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేసుకొనేవాళ్లం. ఇంట్లో పూజ అయిపోగానే వీధిలో ప్రతిష్ఠించిన వినాయకుడి దగ్గరకి వెళ్లేవాళ్లం. ఆటలు పాటలు అన్నీ అక్కడే. ఎప్పుడో కానీ ఇంటికి వెళ్లేవాణ్ని కాదు. పెద్దయ్యాక ఆ సందడి కాస్త తగ్గినా... ఇప్పటికీ నాకు ఇష్టమైన పండగంటే వినాయక చవితే. గతేడాది ఉపాసనతో కలిసి పూజల్లో పాల్గొన్నాను. ఈసారి కూడా కుటుంబ సభ్యుల మధ్య పండగని జరుపుకొంటాను. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టివిగ్రహాల్ని ప్రతిష్ఠించుకోవడం మేలు''.

  చిన్ననాటి రోజుల్లో - మహేష్‌బాబు

  చిన్ననాటి రోజుల్లో - మహేష్‌బాబు

  వినాయకచవితి అనగానే చెన్నైలో అందరితో కలిసి ఆనందంగా గడిపిన రోజులు నాకు గుర్తుకొస్తాయి. గణేష్‌ మండపాల్ని చూసేందుకు అందరం కలిసి వెళ్లేవాళ్లం. ఇంట్లో పూజని కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకొనే వాళ్లం. ఇప్పుడు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యమిస్తాను. అందరికీ ఇదే చెప్తాను. పర్యావరణాన్ని పరిరక్షించడం అవసరం కదా. ఎంత పెద్ద విగ్రహం పెడితే పూజ అంత ఘనంగా చేసినట్లు అనుకుకోకూడదు''.

  పోటాపోటీగా తిరిగేవాళ్లం - హరిప్రియ

  పోటాపోటీగా తిరిగేవాళ్లం - హరిప్రియ

  ''వినాయకచవితి అంటే నాకు చాలా సరదా. చిన్నతనంలో మేం చేసిన సందడి గుర్తుకు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. మా ఇంట్లో పూజ ఉండేది కాదు. మా అమ్మమ్మ వాళ్లింట్లో జరుగుతుంది. దీంతో చిన్నతనంలో వినాయకచవితి వచ్చిందంటే అక్కడికి వెళ్లిపోయేదాన్ని. మా కజిన్స్‌, స్నేహితులతో అల్లరే అల్లరి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రివరకు ఎవరు ఎక్కువ విగ్రహాల్ని చూస్తారా అని. మా మధ్య ఓ పోటీ ఉండేది. గతేడాది వినాయకచవితిని మాత్రం నేను మరచిపోలేను. ఆ రోజు 'అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్‌' చిత్రీకరణలో ఉన్నాను. ఈసారి ఒక్క గణేష్‌ విగ్రహాన్ని కూడా చూడలేదే అని సాయంత్రం వరకు అనుకున్నా. కానీ చిత్రీకరణ అయిపోయి తిరిగి వెళ్తున్నప్పుడు నా కారు డ్రైవరు ఓ వీధి నుంచి తీసుకెళ్లాడు. అక్కడ చాలా విగ్రహాలున్నాయి. వాటిని చూస్తే ఆనందమేసింది''.

  అమ్మ నుంచి వచ్చింది - కరీనా కపూర్‌

  అమ్మ నుంచి వచ్చింది - కరీనా కపూర్‌

  ''వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది పిల్లల హడావుడి. నా చిన్నతనం నుంచి ఈ పండగ రోజు మా అల్లరిని చూసి అందరూ ఆనందించేవారే. మా తాత రాజ్‌కపూర్‌ హయాం నుంచి మా ఇంట్లో వినాయకచవితిని ఘనంగా జరుపుతున్నారని అమ్మ చెప్పింది. మిగతా పండగలతో పోలిస్తే వినాయకుడికి పూజాకార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. మా అమ్మ బబిత ఈ పూజని నిష్టగా చేస్తుంది. నాకు అమె నుంచే ఈ అలవాటు వచ్చింది. మా అక్క కూడా ఇంతే. ఇద్దరం ఎంతో శ్రద్ధగా పూజలు చేస్తాం. 'హీరోయిన్‌' చిత్రీకరణ సమయంలో వినాయకుని దేవాలయాలకు వెళ్లి దర్శించుకోవడాన్ని మరచిపోలేను''.

  మామూలు ఆడపిల్లలాగే - సోనాక్షి సిన్హా

  మామూలు ఆడపిల్లలాగే - సోనాక్షి సిన్హా

  ఆడపిల్లలు ఎంత ఎదిగినా సంప్రదాయాన్ని మరచిపోకూడదనేది మా అమ్మ సిద్ధాంతం. సంప్రదాయాల విషయంలో అమ్మ నిక్కచ్చిగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఎప్పుడైనా మాములు ఆడపిల్లల్లాగే అన్ని పనులు చేయాల్సిందే. నేనేదో కథానాయికను కాబట్టి తప్పించుకుంటానంటే కుదరదు. అదే వినాయకచవితి వచ్చిందంటే పూజా కార్యక్రమాలు నేనే చేస్తాను. కథ ప్రతి ఏడాది చదవడంతో కంఠతా వచ్చేసింది. పుస్తకాలతో పని లేకుండా పూజ చేస్తాను''.

  శుభాకాంక్షలు..

  శుభాకాంక్షలు..

  పాఠకులందరికీ ధట్స్ తెలుగు ...వినాయక చవతి శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

  శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
  ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే

  తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

  అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
  అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే
  (అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.

  English summary
  Mahesh Babu is a big fan of the Vinayaka Chavithi festival. Apparently, Mahesh Babu was quite an active participant in festive activities during his childhood. But the bright colour lead paints used to deck up the Vinayaka idols are taking a severe toll on the environment. Mahesh Babu is aware of this and that is the reason why he uses eco-friendly Ganeshas only. He also encourages his friends and family members to do the same.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more