ఇండస్ట్రీలో మహేష్, రామ్ చరణ్ హవా...

By Bojja Kumar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజలు పరిశ్రమలో ప్రస్తుతం దాదాగిరి చలాయిస్తూ సెటిల్ మెంట్లు చేస్తున్నారు. వీళ్ల దూకుడుకు ఇతర హీరోలు, దర్శక నిర్మాతలు భయపడే పరిస్థితులు, వారితో పెట్టుకోవడం ఇష్టం లేక పక్కకు తప్పుకునే సిచ్చువేషన్లు నెలకొన్నాయి. ఏంటి..? నమ్మబుద్ది కావడం లేదు కదూ. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆ మధ్య విడుదలైన మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రాన్ని తీసుకుంటే....ఆ చిత్రం అప్పట్లో చాలా సినిమాలను, దర్శక నిర్మాతలను భయ పెట్టింది. అంతకు ముందు దూకుడు చిత్రం భారీ విజయం సాధించడమే అందుకు కారణం. ఆ సినిమా దెబ్బకు భయపడి చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి బరి నుంచి వాయిదా వేసుకున్నారు. వెంకీ లాంటి పెద్ద హీరోలు మాత్రమే తట్టుకుని నిలబడ్డారు. పరిశ్రమలో దాదాగిరి, సెటిల్మెంట్లు ఇదే మరి. తన సినిమా వస్తుందంటే ఇతర సినిమాలు భయ పడటం దాదాగిరి అయితే, బరి నుంచి పక్కకు తప్పుకుని విడుదల వాయిదా వేసుకుని ఇతర డేట్లు చూసుకోవడం సెటిల్మెంట్లు. ఈ తతంగం వెనక నిర్మాతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని విడుదల విషయంలో రాజీకి వస్తారు అది వేరే విషయం. ఒకేసారి విడుదల చేసుకుని నష్ట పోకుండా ఉండటం కోసమే ఈ ప్రయత్నం అంతా.

తాజా రామ్ చరణ్ రచ్చ సినిమా కూడా అలాంటి దాదాగిరి ప్రదర్శిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఆ సినిమా దరిదాపుల్లో తమ సినిమాలను విడుదల చేయకుండా ప్లాన్ చేసుకున్నారు ఇతర సినిమాల దర్శక నిర్మాతలు. తాజాగా రామ్ చరణ్‌కు గాయం కావడంతో రచ్చ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకావకాశం కనిపిస్తోంది. దీంతో ఇతర సినిమాలు మళ్లీ తమ సినిమాల విడుదల విషయంలో మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే పరిశ్రమలో హిట్ కొట్టినోడే దాదా. తలదన్నేవాడుంటే..తాడిని తన్నేవాడు మరొకరుంటారు. ఇలా తరచూ పరిశ్రమలో దాదాలు మారుతూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ల టైం. ఇలాంటి సత్తా ఉన్న దాదాల లిస్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు కూడా ఉన్నారు. వాళ్ల టైం వచ్చినప్పుడు ఇతర సినిమాల వారు వారిని చూసి భయపడటం కామన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X