వైరల్ పిక్: మహేష్ సంతోషాన్ని రెట్టింపు చేసిన ఎన్టీఆర్, చరణ్.. కన్నుల పండుగ!

Recommended Video

Mahesh babu , Jr ntr and Ram charan at Private Party

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారత అనే నేను చిత్రం ఘనవిజయం సాధించింది. కళ్ళు చెదిరే వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని తెగ ఆకట్టుకుంటోంది. కొరటాల శివ సందేశాత్మక చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగా మిక్స్ చేసారు. ఓ వైపు సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ అంశాలతో మహేష్ ఫాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందించారు. దీనితో భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెట్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ చిత్ర విజయాన్ని మహేష్ ఎంజాయ్ చేస్తున్నాడు. మహేష్ సంతోషాన్ని ఎన్టీఆర్, రాంచరణ్ రెట్టింపు చేసారు.

మహేష్ ఫుల్ ఖుషి

మహేష్ ఫుల్ ఖుషి

భరత్ అనే అనే నేను చిత్రంలో అంతా ప్రత్యేకించి మహేష్ బాబు నటన గురించి మాట్లాడుతున్నారు. ఎప్పటిలాగే మహేష్ నటనతో అదరగొట్టేసినా , ప్రెస్ మీట్ వంటి కీలక సన్నివేశాల్లో సూపర్ స్టార్ నటన మెస్మరైజ్ చేసింది.

మహేష్ సంతోషం రెట్టింపు

మహేష్ సంతోషం రెట్టింపు

భారత అనే నేను చిత్రం విజయం సాధించడంతో ఇటీవల చిత్ర యూనిట్ ప్రవేట్ పార్టీ నిర్వహించింది. ఆ పార్టీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా హాజరయ్యారు. దీనితో మహేష్ సంతోషం రెట్టింపు అయిందని చెప్పొచ్చు.

పెరుగుతున్న బంధం

పెరుగుతున్న బంధం

టాలీవడ్ లో స్టార్ హీరోల మధ్య ఇగోలు ఉంటాయనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. ఎన్టీఆర్, చరణ్, మహేష్ వంటి స్టార్ హీరోలే ఒకరిపై మరొకరు అభిమానం కురిపించుకుంటున్నారు. రంగస్థలం చిత్రం విజయం సాధించడంతో మహేష్, ఎన్టీఆర్ రాంచరణ్ కి అభినందనలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ముఖ్య అతిధిగా ఎన్టీఆర్

ముఖ్య అతిధిగా ఎన్టీఆర్

భరత్ అనే నేను చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరై అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్ ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడని ప్రశంసలు దక్కాయి.

పార్టీలో ముగ్గురూ కలసి

భరత్ అనే నేను సక్సెస్ సాధించడంతో ఇటీవల ఓ ప్రవేట్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఎన్టీఆర్, చరణ్, మహేష్ కలసి ఫొటోకు ఫోజు ఇచ్చారు,. ఫోటో వైరల్ గా మారింది. తాజగా మరోమారు ఈ ముగ్గురు స్టార్ హీరోలుకలసి ఉన్న దృశ్యం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.ఈ ఫోటోని రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X