#ThisHappened2019..అబ్బురపరిచిన సూపర్ స్టార్.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే..!

Recommended Video

#ThisHappened2019: Top Entertainment Handles In India - Male

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమకే ఆరడుగుల అందగాడిగా యువతీ యువకుల మనసు దోచుకున్న ఈ హీరో 2019 సంవత్సరానికి గాను అబ్బురపరిచే ఫీట్ సాధించాడు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక్కడినే.. అది కూడా నేనే అంటూ ఆయన అభిమానుల్లో జోష్ నింపాడు. వివరాల్లోకి పోతే..

భారత దేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్

భారత దేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్

2019 సంవత్సరానికి గాను భారత దేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టును ప్రకటించింది ట్విట్టర్. ఈ లిస్టులో తెలుగు సినీ పరిశ్రమ నుంచి మహేష్ బాబు ఒక్కడే స్థానం దక్కించుకున్నాడు. ఇది చూసి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది.

మొదటి స్థానంలో అమితాబ్.. మహేష్ ప్లేస్ ఎక్కడంటే

మొదటి స్థానంలో అమితాబ్.. మహేష్ ప్లేస్ ఎక్కడంటే

#ThisHappened2019 హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ వదిలిన ఈ టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టులో మొదటి స్థానంలో అమితాబ్ బచ్చన్ నిలిచారు. రెండో స్థానంలో అక్షయ్ కుమార్, మూడో స్థానంలో సల్మాన్ ఖాన్.. ఆ తర్వాత వరుసగా షారుక్ ఖాన్, తమిళ యాక్టర్ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఉన్నారు. మహేష్ బాబు 9వ స్థానంలో నిలిచారు. టాలీవుడ్ నుంచి మహేష్ ఒక్కడే నిలవడం విశేషం.

2019 మహర్షి..

2019 మహర్షి..

2019 మొదట్లోనే మహర్షి సినిమా మొదలెట్టిన మహేష్ బాబు.. అప్పటి నుంచే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. ఆయన కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన 'మహర్షి' రికార్డులను బ్రేక్ చేస్తూ మహేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. 2019 మే నెలలో విడుదలైన 'మహర్షి' బాగా హంగామా చేసింది.

మహేష్.. సరిలేరు నీకెవ్వరు

మహేష్.. సరిలేరు నీకెవ్వరు

ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X