twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తన తల్లితో కలిసి మహేష్ బాబు....(రేర్ ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తన తల్లి ఇందిరతో కలిసి షూటింగు స్పాట్లో ఉన్న మహేష్ బాబు రేర్ ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. మహేష్ బాబు కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఫోటో ఇది.

    మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే...ఇటీవలే మహేష్ బాబు నటించిన ‘ఆగడు' విడుదల కాగా, నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నారు. 'ఆగడు' ఫెయిల్యూర్ ప్రబావం మహేష్ బాబు పై బాగనే పడిందంటున్నారు. పంచ్ డైలాగులు అంటేనే వద్దని చెప్పుతున్నాడని సమాచరం. కొరటాల శివకు ఈ విషయమై సీరియస్ గా చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎక్కడన్నా తప్పితే 60 సీన్స్ లోనూ పంచ్ డైలాగులతో నింపవద్దని, అలాగే పూర్తి కామెడీ చెయ్యవద్దని, సినిమాలో ఒక భాగంగానే కామెడీని పెట్టాలని ఆదేశించినట్లు సమాచరం. ఈ మేరకు కొరటాల శివ స్క్రిప్టులో సర్దుబాట్లు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

    Mahesh Babu rare photo with mother

    గతంలో మిర్చి, రన్ రాజా రన్ చిత్రాలకు కెమెరా వర్క్ ఇచ్చి సినిమాకు బాగా ప్లస్ అయిన మది..తన తాజా చిత్రం నిమిత్తం కోటి నలభై లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఈ పెద్ద మొత్తం అందిందని ఫిల్మ్ నగర్ టాక్.

    దీని తర్వాత 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో మహేష్ బాబు మరో సినిమా చేయబోతున్నట్లు టాక్. 14 రీల్స్ బ్యానర్ కు మహేష్ కు ఉన్న అనుబంధం తెలియంది కాదు. దూకుడుతో మొదలైన ఈ అనుబంధం తర్వాత ‘1నేనొక్కడినే', ఆగడు వరకు కొనసాగింది. అయితే దూకుడు పెద్ద హిట్ అయితే ఆ తర్వాత వచ్చిన 1 నేనొక్కిడినే, ఆగడు చిత్రాలు రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యీయి. దాంతో నిర్మాతలు చాలా లాస్ అయ్యాయి. దాంతో మరోసారి వారికి డేట్స్ ఇవ్వటానికి మహేష్ ముందుకు వచ్చారని సమాచారం. ఈ సారి తనకు గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల తో మరోసారి పనిచేయటానికి ముందుకు వచ్చారు.

    English summary
    Check out Mahesh Babu rare photo with mother Indira.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X