Mahesh babu: నయన్ డాక్యుమెంటరీపై మహేష్ బాబు రివ్యూ.. ఇంతకీ ఏమన్నారంటే?
Mahesh babu - Nayanthara: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ కోసం నయన్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురు చూశారు. ఫైనల్ గా నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. నవంబర్ 18 నుండి ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ తరుణంలో పలువురు సెలబ్రిటీలు ఈ డాక్యుమెంటరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన కామెంట్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ మహేష్ బాబు ఏమన్నారంటే..
స్టార్ హీరోయిన్ నయనతార తన జీవితంపై 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' అనే పేరుతో డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే.. ఈ డాక్యుమెంటరీలో 'నానున్ రౌడీ దాన్'(నేను రౌడీనే)అనే సినిమాను సంబంధించిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. ఆ చిన్న వీడియో క్లిప్ ను ఉపయోగించడమే వివాదాస్పదంగా మారింది.

నయన్ డాక్యూమెంటరీలో ఈ క్లిప్ మెయిన్. నానున్ రౌడీ దాన్ మూవీ మేకింగ్ టైంలోనే నయన్- విగ్నేష్ ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లి 2022లో జరిగిన విషయం తెలిసిందే. అయితే.. నయన్- విగ్నేష్ కలయికను కారణమైన నానున్ రౌడీ దాన్' (నేను రౌడీనే) అనే సినిమాలోని 3 సెకన్ల వీడియో క్లిప్ ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. తన అనుమతి లేకుండా.. ఆ మూవీలో వీడియో క్లిప్ ను ఎలా ఉపయోగిస్తారని ఆ మూవీ నిర్మాత, హీరో ధనుష్ సీరియస్ అయ్యాడు. ఈ మేరకు కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు పంపించారు. ఆ క్లిప్ ను ఉపయోగించుకున్నందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు ధనుష్.
దీంతో ఆగ్రహానికి గురైన హీరోయిన్ నయనతార.. హీరో ధనుష్ పై పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది. నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి ఎన్‌వోసీ(NOC) కోసం దాదాపు 2 సంవత్సరాల నుంచి అభ్యరిస్తున్నామనీ, కానీ దానిని అంగీకరించడం లేదని మండిపడింది. కేవలం 3 సెకన్ల వీడియో క్లిప్ కోసం రూ.10 కోట్లు కట్టాలా..? అంటూ ఫైర్ అయింది. అయినా.. అది సినిమాలోని సీన్స్ కాదని, షూటింగ్ లో తీసుకున్న బియాండ్ సీన్స్ అని తెలియజేసిన ధనుష్ అభ్యంతరం తెలిపారు. 24 గంటల్లోగా ఆ ఫుటేజీని డాక్యుమెంటరీ నుంచి తొలగించాలని, లేకపోతే.. చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అయినా.. ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఈ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఈ డాక్యుమెంటరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. మహేష్ బాబు కూడా ఈ డాక్యుమెంటరీ పై స్పందించారు. మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" గురించి ఓ స్పెషల్ పోస్టర్ ను పోస్ట్ చేశారు. డాక్యుమెంటరీలో నయన్ - విఘ్నేష్ శివన్, వారి కవల పిల్లల అందమైన పోస్టర్‌ను మహేష్ బాబు తన ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో స్పెషల్ గా ఏమి రాయకున్నా.. లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ.. డాక్యుమెంటరీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ దృష్టి "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్"పై పడింది.
ఈ వివాదం కొనసాగుతుంటే.. నయనతార ' రక్కయి' అనే కొత్త సినిమాను ప్రకటించింది. మరోవైపు మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'SSMB 29' మూవీ కోసం రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు లుక్ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపించిన మహేశ్ బాబు.. ప్రస్తుతం గడ్డం తీసివేసి.. నీట్ గా కనిపిస్తున్నారు. వరల్డ్ వైడ్ మూవీ కోసం చాలా మహేశ్ బాబు, అటు రాజమౌళి చాలా కష్ట పడుతున్నారు.


Click it and Unblock the Notifications











