ఇది కష్టకాలమే.. దయచేసి ఇంట్లోనే ఉండండి: మహేష్ బాబు
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145 కు పైగా దేశాల్లో పాగా వేసి వేలాదిమందికి బలిగొంది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కొన్ని సూచనలు ఇస్తున్నారు.
ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా కొందరు స్టార్స్ కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రియాక్ట్ అవుతూ అందరికీ అర్ధమయ్యే విధంగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ సందేశమిచ్చారు.

'COVID -19 నుంచి తప్పించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మార్గం. ఇది కష్టకాలమే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక సమయాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటం మంచిది' అని పేర్కొన్నారు పేర్కొన్నారు మహేష్ బాబు.
దీంతో పాటు ఆయన షేర్ చేసిన వీడియో ప్రతీ ఒక్కరికీ అసలు విషయాన్ని సున్నితంగా చెప్పేసింది. అగ్గిపుల్లల వరుసతో అందరికీ అర్థమయ్యేలా సూపర్ మెసేజ్ ఇచ్చారు మన సూపర్ స్టార్.
View this post on InstagramA post shared by Mahesh Babu (@urstrulymahesh) on


Click it and Unblock the Notifications











