మల్టీ స్టారర్ సినిమాల్లో నటించడానికి ప్రిన్స్ మహేష్ బాబు సరేనంటున్నాడు. మంచి కథ దొరికితే అందుకు మహేష్, తాను కూడా సిద్ధమేనని ప్రముఖ నటుడు, మహేష తండ్రి కృష్ణ చెప్పారు. మంచి కథ కోసం అన్వేషిస్తున్నామని కృష్ణ చెప్పారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రదానం చేసిన కళాప్రపూర్ణను తీసుకోవడానికి ఆయన తన సతీమణి విజయనిర్మలతో కలిసి వచ్చారు. మహేష్ సినిమాకు దర్శకత్వం వహిస్తానని విజయనిర్మల చెప్పారు. మహేష్ తో మల్టీస్టారర్ చిత్రం నిర్మాణానికి చూస్తున్నామని ఆమె చెప్పారు. బహుశా మార్చిలో సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చునని ఆమె అన్నారు.