»   » పవన్ కళ్యాణ్‌‌తో చేయడానికి రెడీ : మహేష్ బాబు

పవన్ కళ్యాణ్‌‌తో చేయడానికి రెడీ : మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మహేష్ బాబు లాంటి టాప్ హీరోల కాంబినేషన్లో సినిమా వస్తే ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదే విషయమై చాలా కాలంగా ఇండస్ట్రీలో చర్చ సాగుతూనే ఉంది. త్వరలో వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయంటూ తరచూ ఫిల్మ్ నగర్లో వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో విజయవాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మహేష్ బాబును...ఇదే విషయమై ఓ విలేఖరి ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నకు మహేష్ బాబు తనదైన రీతిలో స్పందించారు. తనకు, ఆయనకు సెట్టయ్యే మంచి కథ దొరికితే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కథ సూటయితే ఎవరితోనైనా చేస్తానని స్పష్టం చేసారు.

నిజంగా అలాంటి కథ అందించడం సాధ్యమేనా?

మహేష్ బాబు రెడీ అని చెబుతున్నారుగా....మరి టాలీవుడ్లో అలాంటి కథ అందించే సత్తాగల రచయితలు లేరా? అనే డౌట్ మీకు రావొచ్చు. ఇదే విషయం ఇండస్ట్రీలో రచయితలను అడిగితే ఇద్దరిని ఒప్పించే కథ సిద్ధం చేయడం అంత సులభమేమీ కాదని, ఇద్దరూ స్టార్ హీరోలు కావడంతో వారి ఇగోలను మేనేజ్ చేస్తూ కథ సిద్ధం చేయడం కష్టమే అంటున్నారు. నిజంగా ఒప్పుకుంటే అదో అద్భుతం అవుతుందంటున్నారు.

నిజంగానే చేసే ఉద్దేశ్యం వారికి ఉంటుందా?

మీడియాతో మాట్లాడేప్పుడు, వారు వేసే ప్రశ్నలకు.....మహేష్ బాబైనా, పవన్ కళ్యాణ్ అయినా చేస్తామని పాజిటివ్‌గా స్పందించడం సాధారణమే అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కానీ అది ఆచరణలో పెట్టే ఉద్దేశ్యం మాత్రం వారికి ఉండదని పలువురి వాదన. ఆయనతో చేసే ఉద్దశ్యం లేదు, చేయను అని చెబితే.....మీడియాలో మళ్లీ అదో పెద్ద దుమారానికి తెరతీసే అవకాశం ఉంటుంది కాబట్టి వారి స్పందన అలానే తెలుగు సినీపండితులు అంటున్నారు.

English summary
In Interview Telugu actor Mahesh Babu told that, If the compatible story... He is ready to work with Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu