ఫ్లాష్ బ్యాక్.. ఇండియన్ టాప్ డైరెక్టర్ సినిమాలో మహేష్ ఎందుకు నటించలేదు?
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని డిజాస్టర్స్ తరువాత ఎక్కువగా ప్రయోగాలు చేయవద్దని చాలా దృడంగా నిశ్చయించుకున్నాడు. వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ మినిమామ్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే మహేష్ ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కానీ గతంలో ఒక ఇండియన్ టాప్ డైరెక్టర్ ఆఫర్ చేస్తే చేయనని చెప్పేశాడట.

సౌత్ సూపర్ స్టార్ అవ్వాలని..
సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో సౌత్ లో ఇంతవరకు ఎవరు మార్కెట్ సెట్ చేసుకోలేదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా రజినీకాంత్ సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే అదే స్థాయిలో క్లిక్కవ్వడానికి మహేష్ బాబుకి అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ మహేష్ చేయలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

మురగదాస్ దెబ్బ..
మొత్తానికి మురగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేసిన మహేష్ బాబు. ఆ తరువాత మళ్ళీ తమిళ్ వైపు చూడలేదు. ఎందుకంటే మహేష్ కెరీర్ లోనే ఆ సినిమా ఊహించని దెబ్బ కొట్టింది. ఆర్థికంగా దెబ్బ కొట్టడమే కాకుండా మహేష్ అనవసరంగా ఈ కథను ఒప్పుకున్నాడు అని ఒక నెగిటివ్ కామెంట్స్ ని అంసుకున్నాడు. దీంతో మంచి కథ దొరికే వరకు మరో సినిమా చేయవద్దని అనుకున్నాడు

టాప్ దర్శకుడికి నో చెప్పాడు..
మురగదాస్ కంటే ముందే మహేష్ బాబుకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. రోబో సినిమాతో ఇండియన్ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ ఆ తరువాత మహేష్ తో రెండు మూడు సార్లు ఒక సినిమా చేయాలని సంప్రదింపులు జరిపాడు. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ త్రీ ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు. విజయ్ చేసిన మెయిన్ పాత్రలో ముందు మహేష్ బాబుని అనుకున్నారు. కానీ మహేష్ చేయనని చెప్పేశాడు.

ఎందుకంటే..
మహేష్ ఆ సినిమా చేయకపోవడానికి కారణం.. అది రీమేక్ సినిమా అని. మహేష్ తన కెరీర్ లో రీమేక్ సినిమా అస్సలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇదివరకే ఒక భాషలో తెరకెక్కిన సినిమాల కథలను మళ్ళీ తెరకెక్కిస్తే ఆ కిక్కు ఉండదని మహేష్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. మొత్తానికి శంకర్ లాంటి దర్శకుడు ఫామ్ లో ఉండగా ఆయన కథను రిజెక్ట్ చేసిన మహేష్ మళ్ళీ వేరే కథ తీసుకురండి తప్పకుండా చేస్తానని సింపుల్ ఆన్సర్ ఇచ్చాడట.


Click it and Unblock the Notifications











