తెలుగే ఇష్టం.. బాలీవుడ్‌కు మహేష్ నో(ఫోటోలు)
హైదరాబాద్: తనకు బాలీవుడ్ నుండి వరుసగా చాలా ఆఫర్లు వస్తున్నాయని అయితే తాను అంగీకరించడం లేదని ప్రిన్స్ మహేష్ బాబు మంగళవారం అన్నారు. దూకుడు, బిజినెస్‌మెన్, తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో మహేష్ బాబు హ్యాట్రిక్ కొట్టిన దూకుడులో ఉన్నారు.
ఈ రోజు ఆయన హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐడియా సెల్యూలార్ సంస్థ మంగళవారం కొత్తగా ఐడియా 3జి స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఐవరీ పేరుతో మార్కెట్‌లోకి రానున్న ఈ మొబైల్‌ను ఆ సంస్థ ప్రచార కార్యకర్తగా మహేష్ బాబు లాంఛనంగా విడుదల చేశారు.
డ్యూయెల్ సిమ్ సౌలభ్యమున్న ఐడియా 3జి మొబైల్‌ను రూ.7390లకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఐడియా సెల్యులార్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బాబు పిచ్చాపాటిగా మట్లాడారు. తనకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయని చెప్పారు.
అయితే తానే వాటిని అంగీకరించడం లేదన్నారు. బాలీవుడ్ చిత్రాల్లో నటించే ఆసక్తి తనకు లేదన్నారు. తెలుగు అంటే తనకు ఇష్టమని అందుకే తాను టాలీవుడ్ సినిమాలను మాత్రమే చేస్తానని మహేష్ బాబు అన్నారు. కాగా మహేష్ బాబును చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.

ఐడియా 3జి స్మార్ట్ ఫోన్ విడుదల కోసం వస్తున్న ప్రిన్స్.

ఐడియా సెల్యూలార్ సంస్థ ప్రతినిధుల మధ్య మహేష్ బాబు.

ఐవరీను విడుదల చేస్తున్న హ్యాట్రిక్ హీరో.

మాట్లాడుతున్న మహేష్.


Click it and Unblock the Notifications











