మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడహో...!
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే వెండి తెరకు ఇద్దరు హీరోలు పరిచయం అయిన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు 'ఎస్ఎంఎస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవ్వగా, ఆయన మరో బంధువు శివ 'జగన్' చిత్రం ద్వారా ఇటీవలే వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు.
ప్రస్తుతం కృష్ణ మాధవ్ 'హృదయం ఎక్కడున్నది' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈచితం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆనంద్ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దగ్గర అసోసియేట్ గా పని చేసారు.
ఈ చిత్రంలో కృష్ణ మాధవ్ కు జోడీగా అనూష, సంస్కృతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్, పవన్ సంయుక్తంగా కీర్తి మీడియా, హేమ క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా ఆహుతి ప్రసాద్, ప్రసాద్ బాబు, హర్ష వర్ధన్, రజిత, ధన్ రాజ్, అనంత్, పృథ్వి, ఫని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా : ప్రసాద్ జికె, ఎడిటింగ్ : శ్రవణ్, ఆర్ట్ : శ్రీకాంత్.


Click it and Unblock the Notifications












