»   » మహేష్ బాబు ఔట్...హీరో సూర్యకు భలే ఛాన్స్!

మహేష్ బాబు ఔట్...హీరో సూర్యకు భలే ఛాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ద్వయం రాజ్ - డికె ఆ మధ్య ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అప్పట్లో అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది. అయితే అనుకోండా ఈ చిత్రం క్యాన్సిల్ అయింది. మహేష్ బాబుకు స్టోరీలైన్ నచ్చక పోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం......మహేష్ బాబు నో చెప్పిన అదే స్టోరీని రాజ్-డికెలు సౌతిండియా స్టార్ హీరో సూర్యకు చెప్పి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్‌కు చెందిన వైజయంతీ బ్యానర్లో నిర్మించనున్నట్లు టాక్.

Mahesh babu replaced by Surya

తమిళ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ చాలా పాపులారిటీ ఉంది. ఆయన నటించిన చిత్రాలు ఎన్నో ఇక్కడ ఘన విజయం సాధించాయి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ విడుదలైన సూర్య సినిమాలన్నీ తమిళ అనువాద చిత్రాలే. తెలుగులో ఆయన ఇప్పటి వరకు ఒక్క స్ట్టైట్ సినిమా కూడా చేయలేదు.

రాజ్ - డికెతో సూర్య సినిమా పట్టాలెక్కితే ఆయన తెలుగులో చేయబోయే తొలి తెలుగు సినిమా ఇదే కానుంది. సూర్య కూడా ఎప్పటి నుండో తెలుగులో స్ట్రైట్‌గా ఓ సినిమా చేయాలనే ప్లాన్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
Directors Raj-DK duo was supposed to make a film with Mahesh in the lead. Mahesh heard the storyline and gave a go ahead. Later he dropped the idea of doing this film and moved on to some other venture. Raj DK are ready with the bound script now and are chasing other big star of South cinema Surya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu