తనయుడు యాక్షన్: దూరంగా మహేష్ బాబు
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నూతన చిత్రం '1' 'నేనొక్కడినే'లో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ చిన్నతనంలోని పాత్రను తనయుడు గౌతమ్ పోషిస్తున్నాడు. కాగా ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మహేష్ బాబు వెల్లడించారు. తాను గౌతమ్ తన పాత్రలో నటిస్తున్న సమయంలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదని చెప్పారు.
గౌతం యాక్ట్ చేసే సమయంలో తాను లొకేషన్లో ఉంటే వాడి దృష్టి అంతా తనపైనే ఉంటుందనిపించిందని మహేష్ తెలిపారు. అందుకే ఆ సమయంలో షూటింగ్ లొకేషన్‌కి వెళ్లలేదని చెప్పారు. అంతకుముందు గౌతమ్ యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ.. '1' షూటింగ్ మొదలైన మూడు నెలలకు గౌతమ్‌తో యాక్ట్ చేయిద్దామని దర్శకుడు సుకుమార్ తనతో అన్నారని తెలిపారు.

ఆ తర్వాత తన అసిస్టెంట్‌తో కలిసి సుకుమార్ రెండు మూడు రోజులు తమ ఇంటికొచ్చి గౌతమ్‌తో ఆడుకునే వారని చెప్పారు. గౌతంతో చనువు పెంచుకుంటే ఈజీగా నటింపచేయవచ్చనే ఆలోచనలో వారు ఇలా చేసారని తెలిపారు. సుకుమార్ కోరుకున్న విధంగా గౌతం నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగారని మహేష్ బాబు చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ విషయాలను తెలిపారు. తాను చిన్నతనంలో పార్టీలకు దూరంగా ఉండేవాణ్ని అని, ఇప్పుడూ అంతేనని చెప్పారు. అంతేకానీ 'పేజ్ త్రీ'లో కనిపించాలని, పార్టీలకు అటెండ్ అవ్వాలని తాను కోరుకోనని, నమ్రతా కూడా కోరుకోదని తెలిపారు.
'1-నేనొక్కడినే' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ వారే నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్.


Click it and Unblock the Notifications











