‘118’ మూవీపై మహేష్ బాబు రివ్యూ..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మార్చి 1న విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
తాజాగా ఈ చిత్రం వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ ద్వారా తన రివ్యూ ఇచ్చారు. '118 చిత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపే విధంగా ఉంది. ఇటు సినిమాటోగ్రాఫర్‌గా, అటు డైరెక్టర్‌గా గుహన్ టెక్నికల్ స్కిల్స్ టాప్ రేంజిలో ఉన్నాయి. విజయం అందుకున్న చిత్ర బృందానికి అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు.

అయితే మహేష్ బాబు తన ట్వీట్లో సినిమా హీరో కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, హీరోయిన్లు నివేదా థామస్, షాలిని పాండే ప్రస్తావన కానీ తేక పోవడం గమనార్హం. మహేష్ బాబు ట్వీట్ మీద నిర్మాత మహేష్ఎస్ కోనేరు రియాక్ట్ అవుతూ... థాంక్స్ చెప్పారు.
కాగా.. దర్శకుడు గుహన్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ తయారు చేశారట. ఓ హోటల్‌లో బస చేసినపుడు ఒక అమ్మాయికి సంబంధించిన క్రైమ్ సంఘటన గురించి కల వచ్చేది. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఇదే పాయింటును బేస్ చేసుకుని కథ తయీరు చేసుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











