ఎన్టీఆర్ కథానాయకుడుపై మహేష్ రివ్యూ.. స్టార్ డైరెక్టర్స్ ఏమన్నారంటే!

Recommended Video

NTR Kathanayakudu : Mohan Babu Tweets On The Movie | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా బాగున్న ప్రతి చిత్రాన్ని పోత్సాహిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాడు. మహేష్ తన ట్విట్టర్ వేదికగా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. పలువురు టాలీవడ్ దర్శకులు, సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టారు. ఎవరెవరు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం!

ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయారు

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని వాస్తవికతతో, భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయి నటించారు. మరో ప్రపంచాని చూసిన అనుభూతి కలిగింది. చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కథకు 100 శాతం న్యాయం చేశారు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ కథానాయకుడు కన్నా ఎన్టీఆర్ మహానాయకుడు బావుంటుందని.. ఆ చిత్రం కోసం ఎదురుచూస్తున్నాని మహేష్ తెలిపాడు.

ఘనమైన నివాళి

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఘనమైన నివాళి అని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. ఈ చిత్రం కోసం ఎంతో శ్రమ పడిన దర్శకుడు క్రిష్, బాలయ్యకు నా శుభాకాంక్షలు. ఇది తెలుగు జాతికి గర్వకారణమైన చిత్రం అని కొరటాల అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ కు కొరటాల శివ కూడా ఓ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

రోమాలు నిక్కబొడుచుకున్నాయి

అద్భుతం.. అనిర్వచనీయం.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం థ్రిల్లింగ్ గా, రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంది. ఇలాంటి అద్భుత చిత్రాన్ని అందించిన దర్శకుడు క్రిష్ కు హ్యాట్సాఫ్ అని దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. అనుమానం లేకుండా ఇది బాలయ్య కెరీర్ లో గొప్ప చిత్రం అని తెలిపాడు.

బాలయ్య ఒక కొడుకుగా

ఒక కొడుకు తన తల్లిందండ్రులకు అర్పించిన ఘనమైన నివాళులలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఒకటి అని దర్శకుడు బివిఎస్ రవి అన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో బాలకృష్ణ, కీరవాణి, క్రిష్ ఒక మంచి అనుభూతిని అందించారు అని బివిఎస్ రవి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X