‘వకీల్ సాబ్’కు మహేశ్ బాబు రివ్యూ: పవన్ కల్యాణ్‌పై ఊహించని కామెంట్స్.. గుండెలకు హత్తుకునేలా అంటూ!

'వకీల్ సాబ్'.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం మూడేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తుండడమే. అందుకే అతడి అభిమానులు సినిమా పేరును విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే థియేటర్లను ముస్తాబు చేసి తమ అభిమాన హీరోకు సరైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్ మరింత సంబరపడే పరిస్థితి వచ్చింది. అదేనండీ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. 'వకీల్ సాబ్' మూవీపై రివ్యూ ఇచ్చాడు. ఈ సమయంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే....

అలా గ్యాప్ ఇచ్చి.. ఇలా రీఎంట్రీ అయిన పవన్

అలా గ్యాప్ ఇచ్చి.. ఇలా రీఎంట్రీ అయిన పవన్

రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు సినిమాలకు విరామం ఇచ్చాడు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు.

మొత్తం అదే టాక్.. పవన్‌కు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్

మొత్తం అదే టాక్.. పవన్‌కు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్

'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అయింది. మరికొన్ని చోట్లా ఇది స్పెషల్‌గా వేశారు. ఇక, అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు.

మొదటి రోజే రికార్డు స్థాయిలో... ఏకంగా 40%

మొదటి రోజే రికార్డు స్థాయిలో... ఏకంగా 40%

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్లా 'వకీల్ సాబ్' మూవీకి మంచి స్పందన వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. అందుకు అనుగుణంగానే కలెక్షన్లనూ సాధించింది. ఫస్ట్ డే ఏకంగా రూ. 40 కోట్లు వరకూ వసూలు చేసిన ఈ మూవీ.. ఒక్కరోజులోనే దాదాపు 40 శాతం రికవరీ చేసింది. అదే సమయంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది.

ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు సైతం అలా

ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు సైతం అలా

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 'వకీల్ సాబ్' మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో.. కొందరు సెలెబ్రిటీలు సైతం అదే రీతిలో వెయిట్ చేశారు. అందుకే విడుదలైన రోజే చాలా మంది ప్రముఖులు సినిమాలు చూసి ట్వీట్లు చేశారు. ఇక, శుక్రవారమే చిరంజీవి తన ఫ్యామిలీతో సినిమాను చూసి రివ్యూ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

‘వకీల్ సాబ్' సినిమాను చూసిన మహేశ్ బాబు

‘వకీల్ సాబ్' సినిమాను చూసిన మహేశ్ బాబు

తన సినిమాలే కాదు.. ఏ హీరో చిత్రమైన చూడడం సూపర్ స్టార్ మహేశ్ బాబుకు అలవాటు అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే ఎన్నో చిత్రాలను చూసి.. దానిపై ట్వీట్లు కూడా చేశాడతను. తెలుగువి మాత్రమే కాదు.. వేరే భాషల చిత్రాలనూ, నటీనటులను ప్రోత్సహిస్తుంటాడతను. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' మూవీని తాజాగా వీక్షించాడు మహేశ్.

పవన్ కల్యాణ్‌పై మహేశ్ ఊహించని కామెంట్స్

పవన్ కల్యాణ్‌పై మహేశ్ ఊహించని కామెంట్స్

గత రాత్రి తన ట్విట్టర్ ద్వారా 'వకీల్ సాబ్' సినిమాను చూసినట్లు తెలిపాడు మహేశ్ బాబు. అంతేకాదు.. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు. ఇందులో 'వకీల్ సాబ్‌లో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్‌గా నటించాడు. సరైన కమ్‌బ్యాక్ ఇది. అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టేశాడు. అతడికి నా శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు. దీనిపై ఇద్దరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Recommended Video

Vakeel Saab Day 1 Collections Report | ఈ వారం చాలా కీలకం !
వాళ్ల నటన గుండెలకు హత్తుకునేలా ఉందంటూ

వాళ్ల నటన గుండెలకు హత్తుకునేలా ఉందంటూ

మిగతా విభాగం గురించి, నటీనటుల గురించి కూడా ట్వీటాడు. 'ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ నటన అద్భుతంగా ఉంది. అలాగే, నివేదా, అంజలి, అనన్యల నటన గుండెలకు హత్తుకునేలా ఉంది. థమన్ తన సంగీతంతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. దిల్ రాజు, వేణు శ్రీరామ్, పీఎస్ వినోద్, బోనీ కపూర్ సహా చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అంటూ చెప్పుకొచ్చాడు మహేశ్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X