రాజమౌళి కొడుక్కి మహేశ్ బాబు థ్యాంక్స్.. ఇంతలా నవ్వి చాలా కాలం అయింది అంటూ!
యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో సాగే సినిమాల సంఖ్య అన్ని భాషల్లోనూ తగ్గిపోయింది. దీంతో ఇలాంటి చిత్రాలు ఎప్పుడు వచ్చినా.. ఏ భాష నుంచి మంచి స్పందనను అందుకుని సక్సెస్ అవుతున్నాయి. అలా ఇటీవలే మలయాళంలో వచ్చి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన మూవీనే 'ప్రేమలు' (Premalu). యువ నటీనటులు చేసిన ఈ సినిమా కంటెంట్‌కు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. దీంతో దీన్ని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దీనికి రివ్యూ ఇచ్చాడు. ఆ వివరాలను మీరే చూడండి!
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ తెరకెక్కించిన సినిమానే 'ప్రేమలు'. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా రికార్డు కలెక్షన్లను రాబట్టింది.

మలయాళంలో దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించిన 'ప్రేమలు' సినిమాను దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులోకి తీసుకు వచ్చాడు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను మార్చి 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు. దీనికి ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చి భారీ కలెక్షన్లు లభిస్తున్నాయి.
క్రేజీ కామెడీతో రూపొందిన 'ప్రేమలు' మూవీకి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం 'ప్రేమలు' మూవీపై తన రివ్యూను చెబుతూ ట్వీట్ చేశాడు.
తాజాగా X (ట్విట్టర్)లో మహేశ్ బాబు 'ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించినందుకు కార్తికేయకు పెద్ద థ్యాంక్స్. ఈ మూవీ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అసలు చివరిసారిగా ఓ సినిమా చూసి ఇంతలా నవ్వుకొని చాలా రోజులైంది. నా ఫ్యామిలీ మొత్తానికి ఈ చిత్రం బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ అందరూ అద్భుతంగా యాక్టింగ్ చేశారు. మూవీ టీమ్ మొత్తానికి కంగ్రాట్యులేషన్స్' అని రాసుకొచ్చాడు. దీంతో ఈ చిత్రం మరింత మందికి చేరువ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. యూత్‌ఫుల్ లవ్ అండ్ కామెడీ జోనర్‌లో రూపొందిన 'ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.


Click it and Unblock the Notifications











