సమ్మోహనంపై ప్రిన్స్ మహేష్ బాబు రివ్యూ.. వాట్ ఏ మూవీ.. బ్రిల్లియెంట్!

By Rajababu

గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత చిత్రాల డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో యువ హీరో సుధీర్‌బాబు, అందాల తార అదితిరావు హైదరీ జంటగా నటించిన సమ్మోహనం చిత్రం తొలి ఆట నుంచే మంచి స్పందన సొంతం చేసుకొన్నది. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి బ్రహ్మండమైన టాక్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ వైపు దూసుకెళ్తున్నది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన ప్రిన్స్ మహేష్‌బాబు.. సమ్మోహనం చిత్రానికి రిలీజ్‌కు ముందే బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయని అన్నారు. జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని రిలీజ్ రోజే ప్రిన్స్ మహేష్ వీక్షించారు. వెంటనే తన స్పందనను వరుస ట్వీట్లతో వ్యక్తపరిచారు.

 హృదయానికి హత్తుకునే

హృదయానికి హత్తుకునే

సమ్మోహనం చిత్రం గురించి పరిశ్రమ వర్గాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. దృశ్యకావ్యంలా ఉండే సన్నివేశాలు, హృదయాన్ని అత్తుకొనే మ్యూజిక్, వినూత్నమైన కథాంశం. సుధీర్‌బాబు, అదితిరావు ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్‌ చెబుతూ ప్రిన్స్ మహేష్ ట్వీట్ చేశారు.

అందంగా తీర్చిదిద్దారు

అందంగా తీర్చిదిద్దారు

సమ్మోహనం చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా అందంగా తీర్చిదిద్దారు. అద్భుతంగా డైరెక్ట్ చేశారు. మన పరిశ్రమలో అత్యద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఆయన ఒకరు. సమ్మోహనం గురించి మాటల్లో చెప్పలేను. సింప్లీ ఐ లవ్ ఇట్ అని ఓ ట్విట్‌లో ప్రిన్స్ మహేష్ పేర్కొన్నారు.

 కెరీర్‌లోనే అత్యుత్తమం

కెరీర్‌లోనే అత్యుత్తమం

సుధీర్‌బాబు, అదితిరావు హైదరీ తమ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. వారి కెరీర్‌లోనే ఉత్తమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ నటులు నరేష్ గారు ఫెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అతని నటన బ్రిల్లియెంట్. మంచి సక్సెస్ సాధించిన చిత్ర యూనిట్‌ కంగ్రాట్స్ అని మహేష్‌బాబు మరో ట్వీట్‌ చేశారు.

 మహేష్‌ ట్వీట్‌.. అదితిరావు రిట్వీట్

మహేష్‌ ట్వీట్‌.. అదితిరావు రిట్వీట్

మహేష్ చేసిన ఓ ట్విట్‌కు హీరోయిన్ అదితిరావు తిరిగి బదులు ఇచ్చారు. థ్యాంక్యూ థ్యాంక్యూ మహేష్‌బాబు. మీ నుంచి ఇలాంటి స్పందన రావడం థ్రిల్లింగ్‌గా ఉంది అని మహేష్ ట్వీట్‌ను అదితి రీట్వీట్ చేశారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన అదితిరావు సమ్మోహనం చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సాధించడం గమనార్హం.

 యూఎస్‌లో మంచి స్పందన

యూఎస్‌లో మంచి స్పందన

యూఎస్‌లో ప్రీమియర్స్ మంచి స్పందన లభించింది. ఫస్ట్ షో నుంచి సానుకూలమైన స్పందన సినీ, ప్రేక్షక వర్గాల్లో మోర్మోగుతున్నది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ఎందరో తమ స్పందనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచే ఈ చిత్రంపై పాజిటివ్‌గా ఉన్న ప్రిన్స్ మహేష్‌బాబు వరుస ట్వీట్లతో తన స్పందనను వ్యక్తం చేయడం సమ్మోహనం చిత్రానికి మరింత ప్లస్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X