Jawan మూవీపై మహేశ్ రివ్యూ: షారూఖ్‌పై ఊహించని వ్యాఖ్యలు.. ఆ రికార్డుల గురించి కూడా!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై తనదైన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. విలక్షణమైన నటనతో పాటు పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరచుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లు కొట్టట్లేదు. ఈ పరిస్థితుల్లోనే 'పఠాన్'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇదే ఊపుతో ఇప్పుడు షారూఖ్ 'జవాన్' మూవీ చేశాడు. దీనిపై తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు రివ్యూ ఇచ్చాడు. ఆ వివరాలు మీరే చూడండి!

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన చిత్రమే 'జవాన్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా రికార్డు ఓపెనింగ్స్‌ను ఇది రాబట్టింది.

Mahesh Babu Review on Shah Rukh Khan Starrer Jawan Movie

షారూఖ్ ఖాన్ 'జవాన్' మూవీకి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం 'జవాన్' మూవీపై తన రివ్యూను చెబుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు.

మహేశ్ బాబు చేసిన ట్వీట్‌లో 'జవాన్ బ్లాక్‌బస్టర్ సినిమా. కింగ్‌తో డైరెక్టర్ అట్లీ కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. ఇది అతడి కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ ఆరా, ఛరీష్మా, స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఆయన చెలరేగిపోయాడు. ఈ చిత్రంతో షారూఖ్ తన గత చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. లెజెండ్ల నుంచి వచ్చిన స్టఫ్ ఎంత బాగుంది' అని చెప్పుకొచ్చాడు.

ఇక, 'జవాన్' మూవీ రిలీజ్‌కు ముందు కూడా మహేశ్ బాబు ఓ ట్వీట్ చేశాడు. అందులో 'జవాన్ సినిమా టైం వచ్చేసింది' అంటూ చిత్ర యూనిట్‌కు విడుదల సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీనికి షారూఖ్ స్పందిస్తూ.. 'థ్యాంక్యూ సో మచ్ ఫ్రెండ్. మీరు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. మీరు సినిమా చూసే ముందు నాక్కూడా చెప్పండి. నేను కూడా మీతో జాయిన్ అవుతాను. బిగ్ హగ్' అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య బాండింగ్ ఇలా బయటపడింది.

Mahesh Babu Review on Shah Rukh Khan Starrer Jawan Movie

ఇదిలా ఉండగా.. 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X