ఉప్పెనపై మహేష్ బాబు రివ్యూ: హాట్సాఫ్..రియల్ స్టార్స్ మీరే.. దేవీ శ్రీ ప్రసాద్‌పై ప్రశంసలు

ఉప్పెన చిత్రంపై ఇప్పటికే సినీ ప్రముఖులు, విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు చేరారు. దుబాయ్‌లో సర్కారు వారీ పాట షూటింగు ముగించుకొని వచ్చిన మహేష్ ఈ సినిమాను ఇటీవల వీక్షించారు. అనంతరం వరుస ట్వీట్లతో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు మహేష్ బాబు చేసిన ట్వీట్లు మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఏమని ట్వీట్లు చేశారంటే..

 ఉప్పెన క్లాసిక్ మూవీ

ఉప్పెన క్లాసిక్ మూవీ

ఉప్పెన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ మూవీ గొప్ప క్లాసిక్. దర్శకుడు బుచ్చిబాబు సమయంతో పనిలేకుండా గొప్ప సినిమాను రూపొందించారు. మీ అందర్ని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

 దేవీ శ్రీ ప్రసాద్ నీవు రాకింగ్ స్టార్

దేవీ శ్రీ ప్రసాద్ నీవు రాకింగ్ స్టార్

ఇక ఉప్పెన సినిమాకు మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉప్పెన సినిమాకు దేవీ శ్రీ మ్యూజిక్ గుండె కాయ లాంటింది. ఎల్లకాలం ఈ సినిమా మ్యూజిక్‌ను గుర్తుంచుకొంటారు. డీఎస్పీ అందించిన మ్యూజిక్‌ విషయానికి వస్తే ఇదే అత్యుత్తమ మ్యూజిక్. ఇలాగే నీవు గొప్ప మ్యూజిక్ అందించాలి అంటూ మహేష్ బాబు మరో ట్విట్‌లో పేర్కొన్నారు.

వైష్ణవ్, కృతి..మీరు రియల్ స్టార్స్

వైష్ణవ్, కృతి..మీరు రియల్ స్టార్స్

ఆ తర్వాత వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలపై మహేష్ ఓ రేంజ్‌లో ప్రశంసించారు. సినీ పరిశ్రమకు కొత్తవారైనా వారు హృదయాన్ని కొల్లగొట్టే పెర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా మీరు స్టార్స్ అంటూ వారిని మహేశ్ బాబు ఆకాశానికి ఎత్తేశారు.

సుకుమార్, మైత్రీకి మహేష్ ప్రశంసలు

సుకుమార్, మైత్రీకి మహేష్ ప్రశంసలు

ఉప్పెన లాంటి గొప్ప సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ హ్యాట్సాఫ్. ఇది పది కాలాలపాటు చరిత్రలో నిలిచిపోయే చిత్రమని చెబుతున్నాను. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది అని మహేష్ బాబు తన ట్వీట్‌లో తెలిపారు.

10 రోజుల్లో ఉప్పెనలా కలెక్షన్లు

10 రోజుల్లో ఉప్పెనలా కలెక్షన్లు

ఇదిలా ఉండగా, ఉప్పెన సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. 10 రోజుల్లో ఈ చిత్రం రూ.50 కోట్ల నికర వసూళ్లు, 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ దాటి భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X