మహేష్ బాబు, సాయి పల్లవి గురించి ఆ రూమర్.. ఫ్యాన్స్‌కు కేక పెట్టించే న్యూస్!
సూపర్ స్టార్ మహేష్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు భావిస్తాడు. మహేష్ కు టాలీవుడ్ ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే మహేష్ కు కథ చెప్పి ఒప్పించడానికి చాలా మంది దర్శకులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం మహర్షి చిత్రంలో వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహేష్ నటిస్తున్నాడు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనిల్ రావిపూడి కథ వినిపించగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరుస విజయాలతో
అనిల్ రావిపూడి వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అనిల్ తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలన్నీ విజయవంతం అయ్యాయి. దీనితో మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ తో వరుసగా చిత్రాలు చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో మరో ముందడుగు పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ ఎవరంటే
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని కథని బట్టి సాయి పల్లవి హీరోయిన్ గా అయితే బావుంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన అభిప్రాయాన్ని దిల్ రాజుకు చెప్పారట. వెంటనే చెన్నైకి వెళ్లి సాయి పల్లవికి కథ వివరించమని దిల్ రాజు అనిల్ రావిపూడిని ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి అనిల్ కథ వివరించడం జరిగిందని, తన పాత్ర అద్భుతంగా ఉండడంతో వెంటనే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఫిదా చిత్రంలో
సాయి పల్లవి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సాయి పల్లవి పెర్ఫామెన్స్ కు ఆడియన్స్ నిజంగానే ఫిదా అయ్యారు. వాస్తవానికి ఆ కథ మహేష్ కోసం సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి. ఫిదాలోనే మహేష్, సాయి పల్లవి జంటగా నటించాల్సింది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుండడంతో ఆసక్తి నెలకొంది.

సుకుమార్ చిత్రం
మహర్షి చిత్రం పూర్తి కాగానే మహేష్, అనిల్ రావిపూడి చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ చిత్రం మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ వినిపించిన కథకు మహేష్ సంతృప్తిగా లేడని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ఏడాది మహేష్ బాబు తన సినిమాల విషయంలో కాస్త జోరు పెంచినట్లే ఉన్నాడు.


Click it and Unblock the Notifications











