మహేష్ బాబు ద్వారా మత్తెక్కించే ప్రయత్నం!(ఫోటో)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ మధ్య సినిమాల కంటే యాడ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు 'రాయల్ స్టాగ్' బ్రాండ్‌కి ప్రచారం చేసేందుకు కూడా కమిట్ అయ్యారని ఆ మధ్య వార్తలు కూడా వెలువడ్డాయి. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయింది.
రాయల్ స్టాగ్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులు ఉన్నప్పటికీ...... ముఖ్యమైన ఉత్పత్తి మాత్రం రాయల్ స్టాగ్ విస్కీ. మత్తు కలిగించే ఆరోగ్యానికి హానికారకమైన విస్కీకి ప్రచారం చేయడానికి పబ్లిక్ ఫిగర్లుగా ఉండే సెలబ్రిటీలు ముందుకు రాను. దీంతో అదే పేరుతో ఇతర ఉత్పత్తులు తయారు చేస్తూ వాటికి ప్రచారం చేయించడానికి వారిని ఒప్పిస్తుంటారు. తద్వారా విస్కీకి పరోక్షంగా ప్రచారం కల్పిస్తారన్నమాట. ఈ మధ్య చాలా మద్యం కంపెనీలు ఇలాంటి గిమ్మిక్కులే చేస్తున్నాయి.
తాజాగా మహేష్ బాబుతో కూడా అలానే చేయిస్తున్నారు. రాయల్ స్టాగ్ మెగా మ్యూజిక్ పేరుతో ఓ ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చి దానికి మహేష్ బాబుతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ బ్రాండ్ కు ఇది వరకు చాలా మంది బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లు సైతం ప్రచారం చేసారు. ఇది పరోక్షంగా రాయల్ స్టాగ్ విస్కీకి ప్రచారం చేయడమే అనేది బహిరంగ రహస్యమే. కాదంటారా...?
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం మహేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











