»   » తదుపరి దశలోకి మహేష్ '1-నేనొక్కడినే'

తదుపరి దశలోకి మహేష్ '1-నేనొక్కడినే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం తదుపరి దశలోకి ఈ నెల 30 నుంచి ప్రవేశిస్తుంది. ఆ రోజు నుంచి డబ్బింగ్ ప్రారంభమవుతుంది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టుల డబ్బింగ్ ఫినిష్ చేసి తర్వాత మహేష్ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొత్త అనుభూతికి ప్రేక్షకుడిని గురి చెయ్యాలని దర్శకుడు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో చేజింగ్ సీక్వెన్స్ లు స్పెషల్ గా ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని విధంగా తీస్తున్నారు.


వచ్చే సంక్రాంతికి మురిపించడానికి ఇప్పుడే రంగం సిద్ధం చేసుకొంటున్నాడు మహేష్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ఉపశీర్షిక. కృతి సనన్‌ కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

మహేష్ బాబు కి సంక్రాంతి సెంటిమెంట్ కు బాగా ఫిక్సై నట్లున్నాడు. ఈ ముగ్గుల పండక్కి.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో సందడి చేశాడు మహేష్‌బాబు. అందులో చిన్నోడి పాత్ర ఇంకా మన కళ్లముందు కదులుతూనే ఉంది. గత సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ వచ్చి హిట్టైంది. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక్కడు చిత్రం కూడా సంక్రాంతి విడుదల కావటం గమనార్హం. ఈ నేపధ్యంలో మహేష్ కి సంక్రాంతి బాగా కలిసివస్తుందనే సెంటిమెంట్ తోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాడంటున్నారు.


ఇక ప్రస్తుతం ఆ రికార్డులన్నింటినీ మహేష్‌బాబు '1' 'నేనొక్కడినే' చిత్రం టీజర్ అధిగమించింది. ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం రెండో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ కొత్త టీజర్ కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది.

''మహేష్‌బాబు అభిమానుల్ని మురిపించే సినిమా ఇది. వారి అంచనాలకు తగినట్టే ఉంటుంది. ఇటీవల మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా రెండో ప్రచార చిత్రం విడుదల చేశాం. తొలి మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం'' అని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌.

English summary
The dubbing work of Mahesh Babu’s '1 – Nenokkadine' will start from the 30th of this month. Character actors and other small time artistes will start dubbing in the initial stages. The film is a suspense thriller with a good dose of action and Sukumar is handling the direction. There are a number of chase sequences in the movie. 
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu