మహేష్‌ మేనియా మొదలైంది (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : డిసెంబరు, జనవరి మాసాల్లో మహేష్‌బాబుదే సందడంతా. రెండేళ్లుగా ఆయన సినిమాలు సంక్రాంతికే విడుదలవుతున్నాయి. జనవరిలో సినిమా అంటే.. డిసెంబరు మాసంలో పాటల వేడుకలు జరుగుతుంటాయి. అందులో అభిమానులనుద్దేశించి 'ఈసారి మనకు పండగ రెండు రోజులు ముందుగానే వస్తుంది' అని ప్రకటించేస్తుంటారు మహేష్‌. ఆయన చెప్పినట్టుగానే జరిగిపోతుంది.

'బిజినెస్‌ మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి మహేష్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి పండక్కి '1'(నేనొక్కడినే)తో ఆయన అలరించబోతున్నాడు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా గురించి పరిశ్రమలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్‌ సినిమా విడుదలవుతోందంటే పరిశ్రమలో నెల రోజుల ముందుగానే సందడి మొదలవుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఈ నెల 19న '1' పాటల్ని విడుదల అయ్యింది. అందుకోసం చిత్రబృందం ఎప్పట్నుంచో కసరత్తులు మొదలుపెట్టింది. ఈ పాటల వేడుకని థియేటర్లలో ప్రత్యక్షప్రసారం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండొందల థియేటర్లని అందుకు సిద్ధం చేసి విడుదల చేసారు.

విడుదలకు ముందే...

విడుదలకు ముందే...

మహేష్‌బాబు నటించిన సినిమా విడుదలవుతోందంటే బాక్సాఫీసు దగ్గర కొత్త లెక్కలు నమోదవుతుంటాయి. ఈసారి మాత్రం సినిమా విడుదలకు ముందుగానే ఆ లెక్కలకి పనిపెట్టారు మహేష్‌.

72 కోట్లతో ...

72 కోట్లతో ...

'1' సినిమాకి సంబంధించిన ప్రదర్శనహక్కుల్ని రూ: 72 కోట్లతో సొంతం చేసుకొంది ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ. ఇలా ఒక తెలుగు సినిమాని ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే అంత మొత్తాన్ని వెచ్చించి సినిమాని సొంతం చేసుకొంది ఏరోస్‌ సంస్థ.

హూ ఆర్‌ యూ...

హూ ఆర్‌ యూ...

సినిమా ప్రచారం కోసం చిత్రబృందం సరికొత్త ఆలోచనలతో ముందుకెళుతోంది. ఆ విషయంపై మహేష్‌ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. మొహం కనీ కనిపించకుండా మొదలైన ప్రచార పర్వం... ఇప్పుడు మైక్రో టీజర్‌ వరకు చేరింది. హూ ఆర్‌ యూ... హూ ఆర్‌ యూ... అంటూ సాగే పాటతో ఇటీవలే ముప్పై సెకన్ల నిడివి గల మైక్రో టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది.

రాక్ స్టార్ గా..రచ్చ

రాక్ స్టార్ గా..రచ్చ


ఈ చిత్రంలో మహేష్‌ ఒక రాక్‌స్టార్‌గా కనిపిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌ కనిపించే విధానం కొత్తగా ఉంటుందని ఆ టీజర్‌ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. చిన్నపాటి ఆ టీజర్‌కి యూట్యూబ్‌లో భారీగా హిట్స్‌ లభించాయి. రాజమౌళిలాంటి దర్శకులు సైతం ఆ టీజర్‌ని అభినందించారు.

పాటలు కేక...

పాటలు కేక...

ఈ చిత్రం పాటలు ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. లండన్ బాబు అంటూ సాగే ఐటం సాంగ్ అంతటా వినిపిస్తోంది. సాంగ్స్ కు మంచి రివ్యూలే వచ్చాయి. సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక 'ఆగడు'

ఇక 'ఆగడు'

మహేష్‌ '1'కి సంబంధించిన పనులన్నిటినీ పూర్తి చేశారు. ఇటీవలే ముంబైలో తెరకెక్కించిన ఓ ప్రత్యేకగీతంతో చిత్రీకరణ పూర్తయింది. ఆ పాటలో సోఫీచౌదరితో కలిసి ఆడిపాడారు మహేష్‌. ఇటీవలే ముంబై నుంచి తిరిగొచ్చిన ఇక 'ఆగడు'పై దృష్టిపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. యేడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలంటున్న మహేష్‌ '1'కోసం యేడాదిపాటు కష్టపడ్డారు.

సంక్రాంతికే..

సంక్రాంతికే..

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

 ఎవరెవరు..

ఎవరెవరు..

సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X