ఫ్యామిలీతో చూడొచ్చా...? మహేష్ ‘1’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోన్న మహేష్ బాబు '1-నేనొక్కడినే' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. U/A సర్టిఫికెట్ జారీ కావడం ద్వారా ఈచిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చని స్పష్టమవుతోంది.
ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా వెండితెరకు పరిచయం అవుతుండటం విశేషం. ఈచిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. . ట్రైలర్ పరిశీలిస్తే...హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. జేమ్స్ బాండ్ సినిమాల మీదిరి ఈచిత్రంలో హై యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు చూడబోతున్నామని తెలుస్తోంది. రొటీన్ సినిమాల్లా కాకుండా డిఫరెంటు లొకేషన్లలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బైక్, కార్ చేజింగులు, గన్ షాట్స్.....సస్పెన్స్‌తో కూడిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టి పడేస్తుందని అవగతం అవుతోంది.
ఈ సినిమా తన కెరీర్లో ఇదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇందులో మహేష్ గూడచారి పాత్రలో నటిస్తున్నాడు. క్రితి సానన్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. నాజర్, అను హుస్సేన్, షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, విక్రమ్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ డైలాగులు, మహేష్ బాబు పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications












