»   » నెలాఖరున బెంగళూరులో మహేష్‌ బాబు

నెలాఖరున బెంగళూరులో మహేష్‌ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ నెలాఖరున సూపర్ స్టార్ మహేష్ బాబు బెంగళూరులో కనిపించనున్నారు. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ట్యాగ్ లైన్. కృతిసనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. నెలాఖరున బెంగళూరులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. బ్యాంకాక్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

నిర్మాతలు మాట్లాడుతూ... ''యాక్షన్‌ తరహాలో సాగే వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్‌ బాబు శైలి నటన, సుకుమార్‌ వినూత్నమైన టేకింగ్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం మహేష్‌పై ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 17వరకు బ్యాంకాక్‌లోనే షూటింగ్‌ ఉంటుంది. నెలాఖరున బెంగళూరులో సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. దీంతో సినిమా టాకీ పూర్తవుతుంది. డిసెంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

1 Nenokkadine

ఇక '1'(నేనొక్కడినే) చిత్రం శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డ్ నెలకొల్పిందని, షాకిచ్చే రేంజిలో ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి రానంత రేటు..ఈ చిత్రానికి పలికినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఎంత అనేది స్పష్టమైన రేట్ మాత్రం బయిటకు రాలేదు.

సన్ నెట్ వర్క్ కు చెందిన ఈ ఛానెల్... '1' (నేనొక్కడినే) తమిళ,మళయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టీజర్స్ ద్వారా వచ్చిన క్రేజ్ రేటు పెరగటానికి కారణమైందని చెప్తున్నారు. ఇంతకముందు మాటీవీ వారు అత్తారింటికి దారేది చిత్రం శాటిలైట్ రైట్స్ ని రికార్డ్ రేటు కు కొనుగోలు చేసారు. ఈ చిత్రం యూకె, ఐర్లాండ్‌లోని వివిధ లోకేషన్లలో షూటింగ్ జరిగింది.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు. దీని తర్వాత ఫైట్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.


తెరవెనక,తెర ముందు ఈ చిత్రానికి టాప్ పర్శన్స్ పనిచేస్తున్నారు. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu’s undershoot film 1 Nenokkadine in the direction of Sukumar is being canned currently in Bangkok and the schedule will be wrapped in a couple of days more. The final talkie part schedule shoot of the movie will take place in Bangalore soon. Anil Sunkara, Ram Achanta and Gopichand Achanta are producing 1 Telugu film on 14 Reels Entertainment banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu