twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉత్కంఠకు తెర పడింది.. మహేష్ 26 టైటిల్ పోస్టర్స్ వచ్చేశాయ్

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు 25 సినిమాల జర్నీ ముగిసింది. 1999 లో రాజకుమారుడిగా మొదలైన ఆయన సినీ ప్రస్థానం 2019 లో మహర్షిగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఈ 20 ఏళ్ల కాలంలో ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేసి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు టాలీవుడ్ లో నెంబర్ 1 స్టార్‌గా ఎదిగారు. 25 వ సినిమా మహర్షి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. దీంతో మహేష్ 26 వ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు తగ్గట్లే మహేష్ 26 టైటిల్ లుక్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

     అనుకున్నట్లు గానే సరిలేరు నీకెవ్వరూ

    అనుకున్నట్లు గానే సరిలేరు నీకెవ్వరూ

    మహేష్ 26 వ సినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ పరిశీలనలో ఉందని చాలా రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది మహేష్ గత సినిమాలకు భిన్నమైన టైటిల్ కావడంతో ఆయన అభిమానులు సైతం ఈ టైటిల్ పై మక్కువ చూపారు. ఈ నేపథ్యంలో అదే టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ తాజాగా టైటిల్ లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

    మహర్షి లాంటి సాఫ్ట్ టైటిల్ తర్వాత

    మహర్షి లాంటి సాఫ్ట్ టైటిల్ తర్వాత

    మహేష్ కెరీర్‌లో వచ్చిన సినిమాలు ఎక్కువగా సాఫ్ట్ టైటిల్స్‌తోనే వచ్చాయి. అయితే మహేష్ 26 మాత్రం అందుకు భిన్నంగా స‌రిలేరు నీకెవ్వరు అనే టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే అంశం. పైగా ఈ టైటిల్ లుక్ గమనిస్తే.. టైటిల్ పక్కనే తుపాకీ, దానిపై ఓ క్యాప్ పెట్టి ఉంచడాన్ని బట్టి ఇందులో మహేష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది.

    మహేష్ 25 లో చేసిందే.. రిపీట్

    మహేష్ 25 లో చేసిందే.. రిపీట్

    ఇటీవల వచ్చిన మహేష్ 25వ సినిమా మహర్షి నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగస్వాములయ్యారు. రిసల్ట్ చూస్తే సూపర్ డూపర్ హిట్. దీంతో అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు 26వ సినిమాకు కూడా ముగ్గురు నిర్మాతలు ఉండటం విశేషం. ఈ మేరకు నిర్మాతలు దిల్‌రాజు, రామబ్రహ్మం సుంకరలతో పాటు ఈ చిత్ర నిర్మాణంలో మహేష్‌బాబు కూడా భాగం అవుతుండటం గమనార్హం.

    ఆమెనే ఫైనల్ చేశారు

    ఆమెనే ఫైనల్ చేశారు

    ఇక మహేష్ 26 లో యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్ననే ఫైనల్ చేయడం మరో విశేషం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ రోజే (మే 31) చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది.

    English summary
    Mahesh Babu's Maharshi is running successfully with creating new records in his career. Then Mahesh is doing with Anil Ravipudi next. For this movie the title poster has released just now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X