అదీ మహేష్ మూవీ లెక్క! మిలియన్ మార్క్ దిశగా...

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు సినిమా వస్తుందంటే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో....ఆయన సత్తా ఎలా ఉంటుందో మరోసారి రుజుమైంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదలైన సెంకడ్ టీజర్ యూట్యూబులో 1 మిలియన్ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికి వరకు దాదాపు 9 లక్షలకు చేరువైంది. రేపటిలోగా 1 మిలియన్ మార్క్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది.

టీజర్ చూస్తుంటే 'ఆగడు' చిత్రం పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టెనర్ అని స్పష్టం అవుతోంది. ఇక మహేష్ బాబు ప్రతి డైలాగులోనూ పంచ్ లు వేస్తూ అభిమానులను అలరించనున్నారు. 'నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ ను కాదు ఫైటర్ ను' అంటూ మహేష్ బాబు చెప్పిన పంచ్ డైలాగ్ సెకండ్ టీజర్ కు హైలెట్ అయింది. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ చూసి పుల్ హ్యాపీగా ఉన్నారు.

Mahesh Babu's Aagadu 2nd Teaser Set To Cross 1 Million Views

వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. ఆగస్టు 28న ఆడియో విుడదల చేసి సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్లైమాక్స్ సీన్లు షూటింగ్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ పాటలు రెడీ చేసాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X