ఆగడు ఆడియో: భారీ ఏర్పాట్లు, ఝాన్సీ సందడి
హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఆగడు ఆడియో విడుదల కార్యక్రమానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఆడియో విడుదలకు ముందే హైదరాబాద్ శిల్ప కళా వేదిక ముస్తాబైంది. యాంకర్ ఝాన్సీ ఆడియో విడుదలకు ముందు నుంచే సందడి చేశారు. శనివారం సాయంత్రం శిల్ప కళా వేదిక వద్ద సందడి చోటు చేసుకుంది.

మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం తెరకెక్కింది. శుక్రవారం ఆడియో రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బాబు సరికొత్త స్టైలిష్ భంగిమతో ఆకట్టుకుంటున్నారు. ఆడియో పండగ చేసుకుందాం! అనే విధంగా ఆయన ఫోజు ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు.

ఈ వేడుకల్లో అభిమానులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగ్ చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు.

ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











