మహేష్ బాబు తప్ప ఎవరితోనూ వద్దంటున్న తమన్నా!
హైదరాబాద్: సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓవెలుగు వెలిగిన తమన్నా 'హిమ్మత్ వాలా' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్లాపైనా తమన్నా గ్లామర్, పెర్ఫార్మెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో 'ఇట్స్ ఎంటర్టెన్మెంట్', 'హమ్ షకల్స్' అనే మరో రెండు హిందీ చిత్రాల్లో కూడా తమన్నా అవకాశాలు దక్కించుకుంది.
ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన 'ఆగడు' చిత్రంలో కూడా తమన్నా ఎంపికైంది. గత కొంత కాలంగా తెలుగులో తమన్నాకు సరైన హిట్ లేదు. దీంతో సౌత్ చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కథ, హీరో, దర్శకుడు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఇటీవల ఆమె గోపీచంద్ సరసన హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే అవార్తలను తమన్నా మేనేజర్ ఖండించారు. మహేష్ బాబు 'ఆగడు' సినిమాకు తప్ప ఆమె ఇతర ఏ తెలుగు సినిమాలకు సైన్ చేయలేదని స్పష్టం చేసారు. మహేష్ బాబు సినిమా పూర్తయ్యే వరకు ఏ ఇతర చిన్న సినిమాలకు కమిట్ కావొద్దని నిర్ణయించుకుందట. గతంలో తమన్నా మహేష్ బాబు సరరసన ఓ అవకాశాన్ని కాదనుకుని చాలా నష్టపోయింది. అందుకే ఈ సారి అలాంటిదేమీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మహేష్ బాబుతో కలిసి ఒక్క హిట్టు కొడితే తన రేంజి మరింత పెరుగుతుందనేది తమన్నా ఆలోచన.
శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'ఆగడు' చిత్రంలో మహేష్ పాత్ర నానా పటేకర్...అబ్ తక్ చప్పన్ చిత్రంలో చేసిన ఎనకౌంటర్ స్పెషలిస్ట్ ప్రేరణతో ఉంటుందని సమాచారం. అలాగే ఈ పాత్ర పేరు...ఎనకౌంటర్ శంకర్ అని, అనంతపూర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, చాలా పరవ్ ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసారని, అయితే ఆ కథ సీరియస్ గా జరిగితే ఈ సారి..ఫన్ తో నడుస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లోచెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











